పిఠాపురంలో జానీల అరాచకాలు ఎక్కువయ్యాయి : శ్యామల
ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు.సాక్షత్తుగా మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. రాష్ట్రంలో మహిళ హోంమంత్రిగా ఉన్న మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వల్లో ఏమాత్రం చలనం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయని.. ఫిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారని శ్యామల ఆరోపించారు. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్నారు. ముందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి కూటమి ప్రభుత్వం అక్కడ వాలి పోయింది. అప్పటి వరకు రాష్ట్ర మంత్రులు కనీసం ఆవైపు తొంగి చూడలేదు. సాక్షాత్తూ సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలిని ఆమె పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీ నకిలీ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయి. అత్యంత దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారని వాపోయారు. టీడీపీ అఫీషియల్ గ్రూపులో నా గురించి అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. సోషల్ మీడిమాలో అసభ్య పదజాలంతో నాపై పోస్టులు పెట్టారు. నా ఫొటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?. సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?. సినీ ఇండస్ట్రీ నుండి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినిమా నటుడు కాదా?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పనిచేయలేదా?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారా?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.