కుక్కలు, నక్కలు, పందులు.. తగ్గేది లేదంటున్న జోగి రమేష్
సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని అన్నారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఏపీలో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా అని ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది ఉండేది పక్కరాష్ట్రంలో, విషం కక్కేది మాత్రం ఏపీలోని ప్రజలపైనా అని విమర్శించారు మంత్రి జోగి రమేష్.
అమరావతి ఆర్-5 జోన్ లో జగనన్న ఇళ్ల శంకుస్థాపనల సందర్భంగా ఇటీవల జరిగిన మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ ప్రసంగం తీవ్ర సంచలనంగా మారింది. నక్కలు, కుక్కలు, ఊరపందులు అంటూ ప్రతిపక్ష నాయకులపై ఓ రేంజ్ లో మండిపడ్డారాయన. పెళ్లాలను మారుస్తాడంటూ పవన్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తార్చడం ఆయనకు అలవాటని, ఆయన ఓ కంపెనీ పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చారు జోగి రమేష్. జోగి వ్యాఖ్యలు వైరల్ కావడంతో జనసైనికులు రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. పవన్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు ఓవైపు జరుగుతుండగానే మరోవైపు వారిని రెచ్చగొట్టేలా మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.
అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్.. పవన్, చంద్రబాబుపై మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని అన్నారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఏపీలో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా అని ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది ఉండేది పక్కరాష్ట్రంలో, విషం కక్కేది మాత్రం ఏపీలోని ప్రజలపైనా అని విమర్శించారు.
దమ్ము, ఖలేజా ఉందా..?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు దమ్ము, ఖలేజా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. ఎన్నికలకు కుక్కలు, నక్కలు, పందులు కలిసి వస్తాయని, కానీ సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గలలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. విషప్రచారంతో తాము భయపడబోమన్నారు. తాజా వ్యాఖ్యలపై జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి.