18మందితో జనసేన జాబితా.. మూడు స్థానాలు పెండింగ్
మూడు స్థానాలు మినహా ఇదే ఫైనల్ జాబితా అంటున్నాయి జనసేన వర్గాలు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్టు ఓ ప్రకటన విడుదల చేశాయి.
వలస నేతలకు అవకాశం ఇస్తూ, పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి.. వెన్నుపోటులో చంద్రబాబుని మించిపోయారు పవన్ కల్యాణ్. 21 స్థానాల ప్రకటనకు కూడా జనసేన పార్టీ తీవ్ర తర్జన భర్జనలు పడటమే దీనికి ఉదాహరణ. ఇప్పటి వరకు రెండు విడతల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించిన జనసేనాని.. మూడో విడతలో మొత్తం 18మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారు. ఇందులో కొన్ని పేర్లు ఇదివరకే ప్రకటించారు. మూడు స్థానాలు మినహా ఇదే ఫైనల్ జాబితా అంటున్నాయి జనసేన వర్గాలు.
జనసేన అభ్యర్థుల జాబితా#VoteForGlass pic.twitter.com/StgTL6ZqK7
— JanaSena Party (@JanaSenaParty) March 24, 2024
జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు వీరే..
1. పిఠాపురం - పవన్ కల్యాణ్
2. నెల్లిమర్ల - లోకం మాధవి
3. అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్ - పంతం నానాజీ
5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
6. తెనాలి - నాదెండ్ల మనోహర్
7. నిడదవోలు - కందుల దుర్గేశ్
8. పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
9. యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్
10. పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
11. రాజోలు - దేవ వరప్రసాద్
12. తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
13. భీమవరం - పులపర్తి ఆంజనేయులు
14. నరసాపురం - బొమ్మిడి నాయకర్
15. ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
16. పోలవరం - చిర్రి బాలరాజు
17. తిరుపతి - ఆరణి శ్రీనివాసులు
18. రైల్వే కోడూరు - యనమల భాస్కర రావు
అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. లోక్ సభ స్థానాల విషయానికొస్తే కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి జనసేన తరపున పోటీ చేయబోతున్నారు.