పవన్ వర్సెస్ జగన్.. ఓపెన్ డిబేట్ కి నాగబాబు ఛాలెంజ్..
జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందా, చేయదా అంటూ ఇటీవల వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాలంటే ముందు తాము ఇచ్చిన రెండు టాస్క్ లను ఆ పార్టీ నేతలు పూర్తి చేయాలని కండీషన్ పెట్టారు నాగబాబు.
వైసీపీ నేతల్ని కేతిగాళ్లు, జుట్టుపోలిగాళ్లు, అల్లాటప్పా గోంగూరమ్మలు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు. వైసీపీలో ఒకవేళ మంచి నాయకులు ఉంటే, వారికి ఈ మాటలు వర్తించవని అన్నారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందా, చేయదా అంటూ ఇటీవల వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాలంటే ముందు తాము ఇచ్చిన రెండు టాస్క్ లను ఆ పార్టీ నేతలు పూర్తి చేయాలని కండీషన్ పెట్టారు నాగబాబు.
నాగబాబు కండీషన్లు ఏంటంటే..?
వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోదు, ఐదేళ్లపాటు స్థిరంగా పాలిస్తుంది అంటూ సీఎం జగన్ ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేయాలంటున్నారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం ఉందని, ఒకవేళ వైసీపీకి నిజంగానే ఐదేళ్లు పరిపాలించే దమ్ముంటే కచ్చితంగా జగన్ తో ఆ ప్రకటన చేయించాలంటున్నారు నాగబాబు.
ఓపెన్ డిబేట్..
నాగబాబు ఇచ్చిన రెండో టాస్క్ ఓపెన్ డిబేట్. వివిధ మీడియా ఛానళ్లు, కొంతమంది మేధావుల మధ్య పవన్ కి, జగన్ కి మధ్య ఓపెన్ డిబేట్ పెడతామంటూ ఛాలెంజ్ విసిరారు నాగబాబు. ఏపీ ప్రభుత్వ పథకాలు, పరిస్థితులపై పవన్ తో చర్చించే ధైర్యం ఉంటే జగన్ ఈ డిబేట్ కి సిద్ధం కావాలన్నారు. అలా జగన్ డిబేట్ కి సిద్ధమైతే.. తాము 175 స్థానాల్లో పోటీ చేస్తామో చేయమో చెబుతామంటున్నారు నాగబాబు.
థానోస్ రెడ్డి..
తమను పేర్లు పెట్టి పిలవడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని, అలాంటప్పుడు తాము మాత్రం జగన్ ని పేరుతో ఎందుకు పిలవాలంటున్నారు నాగబాబు. నవరత్నాల థానోస్ రెడ్డి అంటూ వెటకారమాడారు. ఇటీవల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మాటల దాడి మొదలు పెట్టారు. వాటికి సోషల్ మీడియాలో ఆల్రడీ కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పుడు నేరుగా నాగబాబు వీడియో రూపంలో ఓపెన్ డిబేట్ అంటూ ఛాలెంజ్ లు విసిరారు. వైసీపీకి కాస్త ఘాటుగానే బదులిచ్చారు. మరి జగన్ టీమ్ ఈ ఛాలెంజ్ లను స్వీకరిస్తుందా, నాగబాబుకి సమాధానం చెబుతుందా.. వారి రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది. మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
మీ Thanos Reddy కి దమ్ముంటే రమ్మనండి చుస్కుందాం....
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 23, 2022
Watch full video here...https://t.co/yA0E67gDny pic.twitter.com/41Ae8enDCp