Telugu Global
Andhra Pradesh

జనసేన విరాళాలు.. సోషల్ మీడియాలో వైసీపీ సెటైర్లు

రోజుకు 2కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఈ విరాళాల కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఎక్కడికెళ్లినా ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లు, భారీ కాన్వాయ్ లు.. వీటన్నిటి కోసం సామాన్య ప్రజలు విరాళాలివ్వడమేంటనేది వైసీపీ అడుగుతున్న లాజిక్.

జనసేన విరాళాలు.. సోషల్ మీడియాలో వైసీపీ సెటైర్లు
X

వన్ డే శాలరీ ఫర్ జనసేన - మన పార్టీ, మన బాధ్యత అంటూ ఆన్ లైన్ లో విరాళాలు ఆహ్వానిస్తోంది జనసేన పార్టీ. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విరాళాలు సేకరిస్తున్నారు. 10రూపాయలతో మొదలు పెట్టి ఎంతైనా విరాళాలు ఇవ్వొచ్చని ఇప్పటికే నాగబాబు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారు. మిగతా నాయకులు, సినీ ఇండస్ట్రీలో ఉన్న జనసేన అభిమానులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.


ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ ల ద్వారా విరాళాలు ఇవ్వొచ్చని సూచిస్తున్నారు జనసేన నాయకులు. QR కోడ్ ద్వారా జనసేన పార్టీకి విరాళం ఇచ్చే ముందు వివరాలు సరిచూసుకోండి అని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ ప్రచారమే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. రాజకీయ పార్టీకి విరాళాలు తీసు కోవడం సహజం. అయితే మరీ ఇంత పబ్లిక్ గా ప్రజలనుంచి వన్ డే శాలరీని అభ్యర్థించడం ఏంటి అని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సెటైర్లు పేలుస్తున్నాయి.


రోజుకు 2కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఈ విరాళాల కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఎక్కడికెళ్లినా ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లు, భారీ కాన్వాయ్ లు.. వీటన్నిటి కోసం సామాన్య ప్రజలు విరాళాలివ్వడమేంటనేది వైసీపీ అడుగుతున్న లాజిక్. అయితే జనసైనికులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. అందరూ తమ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆఖరికి న్యూస్ రీడర్లు కూడా టీవీ డిబేట్లలోనే తాము కూడా విరాళాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ విరాళాల సేకరణకు మరింత ప్రచారం చేసి పెడుతున్నారు.


First Published:  1 Sept 2023 2:38 AM GMT
Next Story