వారాహి యాత్ర రివర్సులో జరుగుతోందా?
కనీసం ఎన్నికలు ముగిసేంతవరకు ఇష్టంలేకపోయినా ఇష్టం ఉన్నట్లే పార్టీలు వ్యవహరిస్తాయి. కానీ అదేమి విచిత్రమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రివర్సులో సాగుతోంది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళను గోకి మరీ గొడవలు పెట్టకుంటున్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా అన్నీ వర్గాలను దగ్గరకు తీసుకోవాలనే చూస్తుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలను మంచి చేసుకుని ఓట్లేయించుకోవాలనే అనుకుంటుంది. పలానా వాళ్ళు కచ్చితంగా తమకు ఓట్లేయరని అనుకున్నా సరే వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంది. కనీసం ఎన్నికలు ముగిసేంతవరకు ఇష్టంలేకపోయినా ఇష్టం ఉన్నట్లే పార్టీలు వ్యవహరిస్తాయి. కానీ అదేమి విచిత్రమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రివర్సులో సాగుతోంది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళను గోకి మరీ గొడవలు పెట్టకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ మాట్లాడుతూ.. అసలు సచివాలయ వ్యవస్థ ఎందుకంటు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు సేవచేయటానికి ఇప్పటికే అనేక శాఖలుండగా ప్రత్యేకించి సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ఎందుకంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపోయారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ నడుము విరగొడతానని ప్రకటించిన పవన్ మరి సచివాలయ వ్యవస్థను ఏమిచేసేది చెప్పలేదు. పవన్ రెండు వ్యవస్థలపై చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమన్నారు.
పవన్ ఆరోపణల వల్ల 2.5 లక్షల మంది వలంటీర్లు+వాళ్ళ కుటుంబ సభ్యులు+వలంటీర్లు ప్రభావితం చేయగలిగిన ఓట్లు జనసేనకు దూరమైనట్లే. ఇక సచివాలయ వ్యవస్థలపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో 1.5 లక్షల మంది జనేసేనకు ఓట్లేస్తారా? వీళ్ళే కాదు వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ప్రభావితం చేయగలిగినంతలో జనసేకు వ్యతిరేకంగానే ఓట్లేయిస్తారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అందుకోవటానికి జనాలు పడిగాపులు పడేవారు. పెన్షన్ అందుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా, ప్రభుత్వ శాఖల్లో ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా జనాలు రోజులు, వారాల తరబడి తిరగాల్సొచ్చేది.
కానీ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ మొదలైన తర్వాత చాలామంది జనాలు హ్యాపీగా ఉన్నారు. జనాలకు కావాల్సిన సర్టిఫికెట్లు, పెన్షన్, రేషన్ అన్నీ ఇళ్ళ దగ్గరకే వచ్చేస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థలతో జనాలు హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో పవన్, చంద్రబాబునాయుడుకు వచ్చిన సమస్యేంటో అర్థం కావటంలేదు. ఏ వ్యవస్థయినా జనాలు ఆదరించకపోతే మనగుడ సాగించలేవు. ఈ రెండు వ్యవస్థలు జనాల్లో బలమైన ముద్ర వేసుకున్నాయంటేనే వాటి పనితీరు బాగున్నట్లే లెక్క. ఇలాంటి వ్యవస్థలపై పవన్, చంద్రబాబు నోరుపారేసుకుంటే నష్టపోయేది ఆ పార్టీలే కానీ వ్యవస్థలు కాదని గ్రహించాలి.