Telugu Global
Andhra Pradesh

ఏపీ విద్యాశాఖ అధికారులకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు తీర్పు

సర్వీస్ అంశాలలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో బుడితి రాజశేఖర్, రామకృష్ణ అనే ఇద్దరు అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.

ఏపీ విద్యాశాఖ అధికారులకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు తీర్పు
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ఈ చర్య తీసుకుంది.

సర్వీస్ అంశాలలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో బుడితి రాజశేఖర్, రామకృష్ణ అనే ఇద్దరు అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.

ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణ ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఉన్నతాధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.

వారిద్దరూ ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని చాలా కాలంగా అభియోగాలు ఎదుర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ కేసులో ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది.

కాగా తీర్పు నేపథ్యంలో హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్న అధికారులు ఇద్దరూ కోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో హైకోర్టు తీర్పును సవరించింది. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించింది.

First Published:  18 Jan 2023 7:46 AM GMT
Next Story