Telugu Global
Andhra Pradesh

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి

ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు.

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి
X

బెంగళూరు నుంచి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్‌కు పార్టీ కేడర్‌ ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో జగన్ పాల్గోన్నారు. మధ్యాహ్నం ఇడుపుల పాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రి అక్కడ జగన్ బస చేస్తారు. నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల 25వ తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 27 న ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్‌ ఖరారు అయింది.

First Published:  24 Dec 2024 1:09 PM IST
Next Story