ఢిల్లీకి జగన్.. ఎల్లోబ్యాచ్ లో టెన్షన్
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలకోసమని, అదని ఇదని చెబుతున్నారు. అయితే ఇందులో కొంత నిజమున్నా అచ్చంగా దీనికోసమే కాదని మాత్రం చెప్పచ్చు.
గడచిన రెండు రోజులుగా ఏపీ రాజకీయాలు ఢిల్లీలో తిరుగుతున్నాయి. బీజేపీతో పొత్తు చర్చల కోసం చంద్రబాబు బుధవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే ఇదే అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు అయినా, పవన్ అయినా పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు చాలాకాలంగా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తు ప్రతిపాదనలపై సంవత్సరాల తరబడి మౌనంగా ఉన్న కేంద్రం పెద్దలు ఇప్పుడు స్పందించారు.
దాంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీకి చేరుకున్నారు. వీళ్ళిద్దరి ప్రయత్నాలు ఇలాగుంటే సడన్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు, పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడితే జగన్ ఏమో ఏకంగా నరేంద్రమోడీతోనే భేటీ అవుతున్నారు. చంద్రబాబు, పవన్ అయితే బీజేపీని పొత్తుకు ఒప్పించేందుకు ఢిల్లీకి వచ్చారనే విషయంలో క్లారిటీ ఉంది. మరి జగన్ ఎందుకు చేరుకున్నట్లు..? ఈ విషయంపైనే ఎల్లోమీడియా కథనాల్లో భయం స్పష్టంగా కనబడుతోంది.
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలకోసమని, అదని ఇదని చెబుతున్నారు. అయితే ఇందులో కొంత నిజమున్నా అచ్చంగా దీనికోసమే కాదని మాత్రం చెప్పచ్చు. అంటే అధికారికంగా కాకుండా రాజకీయ చర్చలు కూడా ఉంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి జరగబోయే లాభనష్టాలపైన మోడీతో జగన్ చర్చించబోతున్నారా..? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తుంటే జగన్ అడ్డుకొట్టేందుకు ఢిల్లీకి చేరుకున్నారా అనే ప్రచారం జరుగుతోంది.
జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజముందో తెలీదు కాని ప్రచార నేపథ్యం మాత్రం నిజమే అని అనుమానించేందుకు దోహదపడుతోంది. పొత్తు చర్చల కోసం చంద్రబాబు, పవన్ కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయిన వెంటనే జగన్ కూడా ప్రధానమంత్రితో భేటీ అవుతుండటం తర్వాత అమిత్ షా తో చర్చలకు భేటీ అవుతుండటం గమనార్హం. ఈ సీక్వెల్ అంతా చూడగానే బీజేపీ కేంద్రంగా ఒకవైపు చంద్రబాబు, పవన్ మరోవైపు జగన్ అంటే క్షీరసాగర మథనం సీనులో లాగ ఉన్నారని అర్థమవుతోంది. అందుకే ఎల్లోబ్యాచ్ లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.