Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రమాణ స్వీకారానికి టైమ్ కూడా ఫిక్స్

ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని ఈపాటికే సీఎం జగన్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ షాకింగ్ న్యూస్ ఏ నెంబర్ దగ్గర ఆగుతుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి టైమ్ కూడా ఫిక్స్
X

వచ్చే ఎన్నికల్లో విజయం తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే -జగన్

జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్-9న ప్రమాణ స్వీకారం చేస్తారు - బొత్స

ఇప్పటి వరకు ప్లేస్, డేట్ ఫిక్స్ అయ్యాయి. తాజాగా టైమ్ కూడా ఫిక్స్ చేశారు వైసీపీ నేతలు. జూన్-9న విశాఖలో ఉదయం 9.30 గంటలనుంచి 11.30 గంటల మధ్య సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఈసారి వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. వర్షం పడుతున్నా కొన్ని చోట్ల ప్రజలు క్యూలైన్లలో వేచి ఉండి మరీ ఓటు వేశారంటే.. జగన్ ని గెలిపించుకోడానికేనని చెప్పారాయన.

గెలుపు ధీమా..

వైసీపీలో గెలుపు ధీమా బలంగా ఉంది. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా ఉంటే.. నాయకులు కూడా అదే నెంబర్ రిపీట్ చేస్తున్నారు. గతంలో 151 స్థానాల్లో వైసీపీ విజయం కూడా ఊహించనిదే, ఈసారి మొత్తం 175 స్థానాల్లో గెలిచి, ఊహలకు అందని విజయాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని ఈపాటికే సీఎం జగన్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ షాకింగ్ న్యూస్ ఏ నెంబర్ దగ్గర ఆగుతుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అటు కూటమిలో మాత్రం గెలుపు ధీమా పెద్దగా లేనట్టు తెలుస్తోంది. కూటమి గెలుస్తుందని అంటున్నారే కానీ, సీట్ల విషయంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్టుగా ఉంది. కనీసం చంద్రబాబు ఫలానా తేదీ, ఫలానా చోట ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఎవరూ ధీమాగా చెప్పడంలేదు. వైసీపీ నేతలు చెప్పారు కాబట్టే.. పోటీగా గంటా శ్రీనివాసరావు.. జూన్-9 అని ప్రకటించారు. అటు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జూన్-9 కోసం విశాఖకు ప్రయాణాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ హోటల్ రూమ్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయినట్టు చెబుతున్నారు.

First Published:  29 May 2024 1:10 AM GMT
Next Story