ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జగన్ పాత్ర? నిజమేనా?
ఎల్లో మీడియాలో ప్రతి ఆదివారం అచ్చయ్యే కొత్త పలుకులో ఈ విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పకడ్బందీగా ఇరికించటానికి సహకరించాలనే ప్రతిపాదన జగన్ దగ్గరకు వచ్చిందట.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా? అంటే ఏ విధంగానూ లేదు, కానీ ఓ విషయంలో పాత్ర పోషించమని కొందరు మధ్యవర్తుల జగన్ దగ్గరకు వచ్చారట. మధ్యవర్తులు ఎవరు? ఎవరి తరపున వచ్చారనే విషయం మాత్రం సస్పెన్స్. ఎల్లో మీడియాలో ప్రతి ఆదివారం అచ్చయ్యే కొత్త పలుకులో ఈ విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పకడ్బందీగా ఇరికించటానికి సహకరించాలనే ప్రతిపాదన జగన్ దగ్గరకు వచ్చిందట. ఇప్పటికే అరెస్టయిన శరత చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మారాలని జగన్‌ను చెప్పమన్నారట.
తమ ప్రతిపాదనకు జగన్ సహకరిస్తే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అరెస్టు కాకుండా కాపాడుతామని మధ్యవర్తుల నుండి ప్రతిపాదన వచ్చిందని ప్రచారం జరుగుతోందని ఎల్లో మీడియా చెప్పింది. అయితే ఈ వివాదంలోకి తనను లాగవద్దని జగన్ స్పష్టంగా మధ్యవర్తులతో చెప్పేశారట. ఇక్కడే ఇంతకాలం అవినాష్ అరెస్టు విషయంలో జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నారని రాసిన వార్తలంతా అబద్ధాలే అని తేలిపోయింది.
మర్డర్ కేసులో అవినాష్ అరెస్టు కాకుండా కాపాడమని మోడీని జగన్ బతిమలాడుకుంటున్నట్లు పదే పదే రాశారు. ఇప్పుడేమో అవినాష్ అరెస్టు కాకుండా ఉండాలంటే కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు సహకరించమని మధ్యవర్తులు ప్రతిపాదన తెస్తే జగన్ తిరస్కరించారని రాసింది. మధ్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరిస్తే అవినాష్ అరెస్టు ఖాయమని తెలిసి కూడా జగన్ తిరస్కరించారంటే అర్థమేంటి? ఎంపీని అరెస్టు చేసుకుంటే చేసుకోమని చెప్పినట్లే కదా.
ఇక్కడ ఎల్లో మీడియా చిన్నలాజిక్ మిస్ అవుతోంది. నిజంగానే అవినాష్ అరెస్టు తప్పదని అనుకుంటే జగన్ ఏ విధంగాను జోక్యం చేసుకోరు. అవినాష్ అరెస్టయితే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారంతే. మర్డర్ కేసు తేలేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పలేరు. అవినాష్‌ను కాపాడటం వల్ల పార్టీ ఇమేజి దెబ్బతింటోందని జగన్ అనుకుంటే అవినాష్ అరెస్టును జగన్ పట్టించుకోరు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారు. నేతల కన్నా పార్టీనే తనకు ముఖ్యమని జగన్ మొదటి నుండి చెబుతున్న విషయాన్ని ఎల్లో మీడియా మరచిపోతోంది. అధికారం కోసం పార్టీ కోసం తల్లి, చెల్లినే జగన్ దూరంపెట్టారని ఇదే ఎల్లో మీడియా చాలాసార్లు రాసింది. అలాంటప్పుడు అవినాష్‌ను దూరంపెట్టడం జగన్ పెద్ద కష్టమా?