Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సరికొత్త స్లోగన్ ఇదేనా?

2019లో బైబై బాబు అయితే 2024లో గుడ్ బై బాబు అనే స్లోగన్ను కాయిన్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త స్లోగన్ వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదే స్లోగన్ను మొదటిసారి జగన్ నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో వినిపించారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సరికొత్త స్లోగన్ ఇదేనా?
X

చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సరికొత్త స్లోగన్ ఇదేనా?

పోయిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వైసీపీ ఇచ్చిన ఒక స్లోగన్ బ్రహ్మాండంగా పేలింది. ఇంతకీ ఆ స్లోగన్ ఏమిటంటే బైబై బాబు అని. మొదట ఈ స్లోగన్ను కాయిన్ చేసింది వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి సోదరిగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ తరపున షర్మిల ప్రచారం చేశారు. చాలా రోడ్డు షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి షర్మిల బైబై బాబు అంటూ గట్టిగా నినదించారు.

ఆ తర్వాత ఆ స్లోగన్ జనాల్లోకి ఫుల్లుగా ఎక్కేసింది. జనాలు కూడా తమంతట తామే బైబై బాబు అంటూ ఒకటికి పది సార్లు చెప్పుకున్నారు. అంటే జనాలు ఈజీగా పట్టుకోవటానికి, ఒకటికి పది సార్లు అనుకునేందుకు ఇలాంటి స్లోగన్లు భలే పేలుతుంటాయి. ఇక వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఇప్పటికే మరో కొత్త స్లోగన్ రెడీ చేశారు. ఇంతకీ ఆ కొత్త స్లోగన్ ఏమిటంటే 'గుడ్ బై బాబు' అని.

2019లో బైబై బాబు అయితే 2024లో గుడ్ బై బాబు అనే స్లోగన్ను కాయిన్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త స్లోగన్ వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదే స్లోగన్ను మొదటిసారి జగన్ నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో వినిపించారు. స్లోగన్ ఎంత క్యాచీగా ఉంటే జనాల్లోకి అంత తొందరగా ఎక్కుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి ఒక స్లోగన్ను వాడింది. అప్పటి ఎన్నికల్లో 'జాబు కావాలంటే బాబు రావాలి' అనే స్లోగన్ జనాల్లోకి బాగా ఎక్కింది. టీడీపీ సోషల్ మీడియా, టీవీ అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఊర్లలో గోడల మీద కూడా ఇదే స్లోగన్‌తో పార్టీ మోతెక్కించేసింది. స్లోగన్ల వల్లే పార్టీలు అధికారంలోకి రావుకానీ పార్టీకి అనుకూలంగా జనాలు మాట్లాడుకునేందుకు ఈ స్లోగన్లు బాగా పనికొస్తాయి. మరి చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ కాయిన్ చేస్తున్న 'గుడ్ బై బాబు' అనే స్లోగన్ జనాల్లోకి ఎలా ఎక్కుతుందో చూడాల్సిందే.

First Published:  22 Nov 2022 10:58 AM IST
Next Story