Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్‌.. రెండు డీఏలు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, గతేడాది జులై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్‌.. రెండు డీఏలు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రెండు డీఏలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, గతేడాది జులై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బ‌కాయిల‌ను ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు న‌గ‌దు రూపంలో చెల్లిస్తారు. కొంత జీపీఎఫ్‌కు జమ చేయనున్నారు.

ఎవ‌రెవ‌రికి ప్ర‌యోజ‌నం?

డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్య‌వసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ ఛార్జ్ ఉద్యోగులకు, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బందికీ పెంచిన డీఏ వ‌ర్తిస్తుంది.

ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

చెప్పిన మాట ప్ర‌కారం ద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

First Published:  16 March 2024 3:44 AM GMT
Next Story