అవ్వాతాతలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఏపీలో ఆసరా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల కొత్త సంవత్సరం 1వ తేదీన సామాజిక పింఛన్లను రూ. 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే.. పెన్షన్ మొత్తాన్ని రూ. 3వేలకు పెంచుతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటివరకు రూ.2వేలు ఉన్న పెన్షన్ మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏడాదికి రూ. 250 చొప్పున పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో లబ్ధిదారులకు రూ. 2750 పెన్షన్ అందిస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి వీరికి రూ. 3వేల పెన్షన్ అందనుంది.
ఇవాళ అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే సామాజిక పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణాన్ని మంత్రిమండలి ఆమోదించింది. లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణల పైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.