సీఎం చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన జగన్
బోకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ధర్మమేనా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నారు.. కాగ్ రిపోర్ట్‌పై కూడా సీఎం తప్పుడు ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా?. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయనను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?’’ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర బాబు దిగిపోయే నాటికి రూ.42,183 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.680 కోట్లు బకాయిలు పెట్టారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. రూ. 28,457 కోట్లు పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు ఆర్థిక విధ్వంకారులో ఈ లెక్కలే సాక్ష్యం. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే. మా హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే వైఎస్సార్‌సీపీ హయాంలో 4 శాతం అప్పులు తక్కువగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి ఎక్కువగా ఉంది. లేని అప్పులు ఉన్నట్టుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేశారు. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు.’’ అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ దుయ్యబట్టారు.దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని జగన్ అన్నారు.