Telugu Global
Andhra Pradesh

జగన్ ఆదేశాలనే లెక్కచేయటంలేదా?

ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న విధానంపై జగన్ నివేదికలను చదివి వినిపించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనని ఎమ్మెల్యేల‌ సంఖ్య 27 నుండి 32కి పెరిగిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జగన్ ఆదేశాలనే లెక్కచేయటంలేదా?
X

తాజాగా సమావేశంలో జరిగిన విషయాలను చూసిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నట్లు అర్ధమవుతోంది. గడప గడపకు మ‌న‌ ప్రభుత్వం పనితీరుపై వర్క్ షాప్ జరిగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న విధానంపై జగన్ నివేదికలను చదివి వినిపించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనని ఎమ్మెల్యేల‌ సంఖ్య 27 నుండి 32కి పెరిగిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంటే అధికారిక నివేదిక ప్రకారమే జగన్ ఆదేశాలను లెక్కచేయని ఎమ్మెల్యేల‌ సంఖ్య పెరిగింది. ఎందుకిలా పెరిగిందో అర్ధం కావటం లేదు. ఇందుకు మూడు కారణాలు ఉండచ్చని అనుకుంటున్నారు. మొదటిదేమో కార్యక్రమంలో పాల్గొనటం ఇష్టం లేకపోవచ్చు. రెండో కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేకపోచ్చు. మూడో కారణం ఏమిటంటే తమకు టికెట్లు రావని కొందరు తీర్మానించుకోవ‌చ్చు. పార్టీలో ఉంటూ.. వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి పోటీ చేయాలని కోరుకుంటున్న వాళ్ళెవరూ జగన్ ఆదేశాలను ధిక్కరించే అవకాశాలు లేవు.

ఈ 32 మందిలో ఆరుగురు మంత్రులు విడదల ర‌జిని, గుమ్మనూరు జయరామ్, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి వీరంతా జగన్‌కు గట్టి మద్దతుదారులే. వీళ్ళు జగన్‌తో ప్రయాణం చేయటానికే ఇష్టపడుతున్నారు. అయినా వీరు జగన్ అంచనాల మేరకు కార్యక్రమంలో ఎందుకు పాల్గొన‌డం లేదన్నది పెద్ద ఫ‌జిల్‌గా మారింది.

మిగిలిన ఎమ్మెల్యేల్లో చెన్నకేశవరెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి లాంటి వాళ్ళు వయోభారం కారణంగా కార్యక్రమాల్లో సరిగా పాల్గొనటంలేదేమో. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి కూడా లేదు. అందుకనే జగన్ ఎంత మొత్తుకుంటున్నా మంత్రులు, ఎమ్మెల్యేల్లో అనాసక్తి కనబడుతోంది. కాకపోతే ఇలాంటి వాళ్ళ సంఖ్య 27 నుండి 32కి పెరగటమే ఆశ్చర్యంగా ఉంది. వివిధ కారణాలతో తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావని ఇప్పటికే తీర్మానించేసుకున్న ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమంలో పాల్గొనటంలేదేమో.

First Published:  17 Dec 2022 12:32 PM IST
Next Story