Telugu Global
Andhra Pradesh

ఢిల్లీకి జగన్.. వీళ్ళల్లో టెన్షన్ మొదలా?

జగన్ మళ్ళీ మోడీని కలుస్తున్నారంటే ఇంకెన్ని నిధులు వస్తాయో, ఏపీ అభివృద్ధికి ఏమి ప్రకటిస్తారో అనే టెన్షన్ ప్ర‌తిప‌క్షాలు, ఎల్లోమీడియాలో మొదలైనట్లుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తుంటే ఇక జగన్‌ను ఓడించటం ఎలాగన్నదే వీళ్ళ ప్రధాన ఏడుపు.

ఢిల్లీకి జగన్.. వీళ్ళల్లో టెన్షన్ మొదలా?
X

ఈనెల 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. నరేంద్రమోడీ, అమిత్ షాతో అపాయిట్‌మెంట్ ఫిక్స్ అయింది. ఒకేరోజు ఇద్దరితో జగన్ అపాయిట్‌మెంట్ ఖరారవ్వటం రాజకీయంగా ఆసక్తిగా మొదలైంది. 5న రాత్రి అమిత్ షాతో భేటీ కుదరకపోతే మరుసటిరోజు సమావేశమవుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ ఢిల్లీ వెళ్ళి మోడీ, షాతో భేటీ అవబోతున్నారనగానే ప్రతిపక్షాల్లో ముఖ్యంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్+ఎల్లో మీడియాలో టెన్షన్ మొదలయ్యేట్లుంది.

ఎందుకంటే జగన్ భేటీ తర్వాత రాష్ట్రానికి ఎన్ని నిధులొస్తాయో ? ఏ రూపంలో నిధులొచ్చేస్తాయో అన్న టెన్షనే ఎల్లో మీడియాకు నిద్ర పట్టనీయటంలేదు. మామూలుగా ఏ రాష్ట్రానికైనా నిధులొస్తే అక్కడి మీడియా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే ఎల్లో మీడియా భోరుభోరున ఏడుస్తోంది. పోలవరం పెండింగ్ నిధులు రూ.12 వేల కోట్లు, రెవెన్యూ లోటు రూ.10 వేల కోట్లు విడుదలైనపుడు ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చిందో అందరూ చూసిందే.

చంద్రబాబు, ఎల్లో మీడియా దృష్టిలో రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదు ప్రభుత్వానికి నిధులుమాత్రం రాకూడదు. నిధులు అందక జగన్ ఇబ్బందులు పడాలి, పథకాలు, అభివృద్ధి ఆగిపోవాలి, జనాలు తిరగబబడాలి, వచ్చే ఎన్నికల్లో జనాలు టీడీపీని గెలిపించాలి ఇదే చంద్రబాబు, ఎల్లో మీడియా బలమైన కోరిక. కానీ జగనేమో పథకాలను ఆపటంలేదు, అభివృద్ధి మొదలైంది, కేంద్రం నుండి నిధుల వర్షం కురుస్తోంది. దీన్నే చంద్రబాబు, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది.

ఈ నేపథ్యంలోనే జగన్ మళ్ళీ మోడీని కలుస్తున్నారంటే ఇంకెన్ని నిధులు వస్తాయో, ఏపీ అభివృద్ధికి ఏమి ప్రకటిస్తారో అనే టెన్షన్ మొదలైనట్లుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తుంటే ఇక జగన్‌ను ఓడించటం ఎలాగన్నదే వీళ్ళ ప్రధాన ఏడుపు. చంద్రబాబు ఏడుపు ఎల్లో మీడియా రాతల్లో స్పష్టంగా బయటపడిపోతోంది. కేంద్రం నిధులు ఇస్తుంటే, సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుంటే ఏడ్చే ప్రతిపక్షం, ఎల్లో మీడియాలాంటి మీడియా ఏపీలో తప్ప ఇంకెక్కడా కనబడదేమో.

First Published:  2 July 2023 10:40 AM IST
Next Story