జగన్ వర్సెస్ చంద్రబాబు.. షెడ్యూల్ పై ఎవరెలా స్పందించారంటే..?
షెడ్యూల్ విడుదల కాగానే చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపైంది. ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తూ ట్వీట్ వేశారు బాబు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాసేపటి క్రితం షెడ్యూల్ విడుదలైంది. నాలుగో విడతలో భాగంగా ఏపీలో అసెంబ్లీ స్థానాలతోపాటు లోక్ సభ స్థానాలకు మే-13న పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్-4న దేశవ్యాప్తంగా కౌంటింగ్, ఫలితాలు ఉంటాయి. ఎన్నికల ప్రక్రియలో షెడ్యూల్ విడుదల కేవలం ఒక ప్రక్రియ మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఈరోజు సందడి నెలకొంది. షెడ్యూల్ విడుదల కాగానే చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపైంది. ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తూ ట్వీట్ వేశారు బాబు. ఐదేళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ట్విట్టర్లో రెచ్చిపోయారు బాబు.
5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమే....
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2024
ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.... జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.... ఇక పోలింగే మిగిలింది.
ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఇక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది...
నవశకం… pic.twitter.com/Y2lisH7ge1
సీఎం జగన్ మాత్రం షెడ్యూల్ విడుదల తర్వాత సిద్ధం అంటూ సింపుల్ గా ట్వీట్ చేశారు. పోలింగ్ రోజుని హైలైట్ చేస్తూ ‘మే 13, 2024 సిద్ధం’.. అంటూ ట్వీట్ చేశారు జగన్. ఈరోజు ఇడుపులపాయలో వైసీపీ ఫైనల్ లిస్ట్ ని ఆయన విడుదల చేశారు. ఈ జాబితా తర్వాత వైసీపీలో ఎక్కడా అలజడి మొదలైన దాఖలాలు లేవు. ఫైనల్ లిస్ట్ లో ట్విస్ట్ లు ఏవీ లేకుండా చూసుకున్నారు జగన్.
13th May 2024 Siddham! #VoteForFan #Siddham
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2024
మంత్రి అంబటి రాంబాబు కూడా షెడ్యూల్ విడుదల తర్వాత చిన్న ట్వీట్ తో సరిపెట్టారు. మళ్ళీ మేమే వస్తాం.. ప్రజాసేవ కొనసాగిస్తాం! అంటూ ట్వీట్ చేశారు అంబటి. ఇక జనసేన అధినేత మాత్రం ఇంకా స్పందించలేదు. షెడ్యూల్ విడుదల తర్వాత పవన్ ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్ కాలేదు. పవన్ సైలెంట్ గా ఉన్నా.. చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో గెలిచేసినట్టుగా ట్వీట్ వేయడం విశేషం.
మళ్ళీ మేమే వస్తాం
— Ambati Rambabu (@AmbatiRambabu) March 16, 2024
ప్రజాసేవ కొనసాగిస్తాం !