జగన్, చంద్రబాబు లైవ్ ఇంటర్వ్యూ.. వ్యూస్ ఎవరికి ఎక్కువంటే!
నిజానికి జగన్ తన ప్రసంగాల్లో గత ఐదేళ్లలో ఏం చేశానో, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేయబోతున్నానో ఒక్కో అంశాన్ని చాలా చక్కగా వివరించారు.
సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తేలిపోయింది. బుధవారం రాత్రి 8 గంటలకు టీవీ-9లో సీఎం జగన్‌తో రజినీకాంత్ ఇంటర్వ్యూ ప్రసారం కాగా.. అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాగా గుర్తింపు పొందిన ABNలో చంద్రబాబు, వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ లైవ్ నడిచింది. ఈ రెండు ఇంటర్వ్యూల ప్రసారం ఏకకాలంలో ప్రారంభమైంది.
అయితే ఈ రెండు ఇంటర్వ్యూల్లో ఎక్కువమంది జనాలు జగన్ ఇంటర్వ్యూ చూసేందుకే ఇష్టపడ్డారు. టీవీ-9లో జగన్ ఇంటర్వ్యూను లైవ్‌లో అత్యధికంగా 72 వేల మంది చూశారు. ఇదే సమయంలో ABNలో ప్రసారం అయిన చంద్రబాబు ఇంటర్వ్యూను అత్యధికంగా చూసింది ఎంత మందంటే.. కేవలం 20 వేల మంది. ఇక సోషల్ మీడియాలోనూ జగన్ ఇంటర్య్వూకు సంబంధించిన అనేక వీడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. కానీ, చంద్రబాబు ఇంటర్వ్యూ ప్రసారమైనట్లు సోషల్‌మీడియాలో పెద్దగా చర్చ కూడా జరగలేదు. అంటే జగన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి జగన్ తన ప్రసంగాల్లో గత ఐదేళ్లలో ఏం చేశానో, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేయబోతున్నానో ఒక్కో అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ఒక్కో అంశంపై ఓపికగా క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ ఏం చెప్తాడో వినాలని ప్రజలు ఆసక్తి చూపారు. ఇక చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తాను పేదలకు ఏం చేశానో చెప్పుకోలేకపోతున్నారు. సంక్షేమం విషయంలో తన మార్క్‌ను చూపించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికీ జగన్ పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటున్నారు బాబు. అంటే పేదల పట్ల ఎవరి విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక జగన్ తను ఏం చెప్పదలుచుకున్నారో అది ముక్కుసూటిగా చెప్పేశారు. కానీ చంద్రబాబు విషయానికి వచ్చే సరికి.. తనకు తాను డబ్బా కొట్టుకోవడం, సోది చెప్పడం, అధికారం కోసం ఎంతకైనా దిగజారి హామీలు ఇవ్వడంలో ఆయనను మించినవారు ఉండరన్న విమర్శ ఎలాగూ ఉంది. ఈ కారణంతోనే చంద్రబాబు ఇంటర్వ్యూను చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.