Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియా ఇలా తృప్తిపడుతోందా..?

తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా రాజీనామా చేశారని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని చెప్పి సంబరపడిపోయింది.

ఎల్లోమీడియా ఇలా తృప్తిపడుతోందా..?
X

జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయాలన్నది ఎల్లోమీడియా టార్గెట్. అయితే ప్రతిరోజు వ్యతిరేక వార్తలు, కథనాలు మాత్రమే రాయాలంటే అవకాశం ఉండదు. అందుకనే వార్తలను సృష్టించేందుకు నానా అవస్థ‌లు పడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ‘జగన్ కోటకు బీటలు’ అనే పిచ్చిస్టోరీ ఒకటి అల్లేసింది. అందులో వైసీపీ మీద ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు భ్రమలు తొలగిపోతున్నట్లు రాసింది. ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, వల్లభనేని బాల‌శౌరితో పాటు మంగళగిరి, రాయదుర్గం ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పార్టీని వదిలేసినట్లు చెప్పింది.

తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా రాజీనామా చేశారని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని చెప్పి సంబరపడిపోయింది. ఇక్కడే ఎల్లోమీడియా ఎంతటి శునకానందం పొందుతోందో అర్థ‌మైపోతోంది. ఎలాగంటే.. పైన చెప్పిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా తమకు టికెట్లు కేటాయించిన తర్వాత పోటీకి ఇష్టపడక పార్టీకి రాజీనామా చేయలేదు. అలా చేస్తే దానికో అర్థ‌ముంటుంది. పార్టీపైన భ్రమలు తొలగిపోయింది కాబట్టే టికెట్ ఖాయమైనా పోటీకి ఇష్టపడక రాజీనామాలు చేసినట్లు రాస్తే అర్థ‌ముండేది.

అయితే వీళ్ళ విషయంలో జరిగిందేమిటి..? వీళ్ళకు టికెట్లు ఇవ్వటానికి జగన్ నిరాకరించారు. పార్టీలో వ్యతిరేకలు పెరిగిపోయారనో, టికెట్ ఇచ్చినా గెలవరనో, సర్వేల్లో నెగిటివ్ వచ్చిందనో జగన్ వేరొక‌ అభ్యర్థులను ప్రకటించేశారు. తమకు ఇక టికెట్లు రావని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీకి రాజీనామాలు చేశారు. ఇందులో జగన్ కోటకు బీటలు ఏముందో అర్థంకావటంలేదు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు విషయమే తీసుకుంటే.. టికెట్ వస్తుందన్న ఆశతోనే ఇంకా రాజీనామా చేయకుండా వెయిట్ చేస్తున్నారు. అంటే జగన్ టికెట్ ఇస్తే వైసీపీలోనే కంటిన్యూ అవుతారు టికెట్ దక్కకపోతే అప్పుడు రాజీనామా చేస్తారు. ఇలాంటి వాళ్ళు పార్టీ నుండి వెళ్ళిపోతే జగన్ కోటకు బీటలు అని రాయటంలో అర్థ‌మేలేదు. 24 మంది ఎమ్మెల్యేల‌కు టికెట్లివ్వకపోతే బయటకు వచ్చేసింది ఐదుగురు మాత్రమే. మరి ఆ విషయం గురించి ఎల్లోమీడియా ఏమి చెబుతుందో.

First Published:  24 Jan 2024 12:07 PM IST
Next Story