Telugu Global
Andhra Pradesh

‘రాప్తాడు సిద్ధం’తో టెన్షన్ పెరిగిపోతోందా..?

జనాల్లో నమ్మకం, ఆసక్తి లేకపోతే ఎంత ప్రయత్నించినా జనాలు సభలకు హాజరుకారు. ఈ విషయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడింది.

‘రాప్తాడు సిద్ధం’తో టెన్షన్ పెరిగిపోతోందా..?
X

అనంతపురం జిల్లా రాప్తాడు భారీ బహిరంగసభ సూపర్ సక్సెస్‌తో చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. `రా..కదలిరా` సభలకు జనాలు పెద్దగా రావటంలేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం బహిరంగసభలకు జనాలు విపరీతంగా హాజరవుతున్నారు. జగన్ అయినా చంద్రబాబు సభలకైనా పార్టీ యంత్రాంగాలు ఇతర ప్రాంతాల నుండి జనాలను సమీకరించాల్సిందే అనటంలో సందేహంలేదు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికార యంత్రాంగం సహకారం కూడా ఉంటుంది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జనాల్లో నమ్మకం, ఆసక్తి లేకపోతే ఎంత ప్రయత్నించినా జనాలు సభలకు హాజరుకారు. ఈ విషయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడింది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షలు చేస్తే జనాలు హాజరుకాలేదు. విజయవాడ బెంజ్‌ సర్కిల్లో ట్రాఫిక్ ను నిలిపేసి సభ పెడితేనే జనాలు కనబడలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అనేక బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో కూడా జనాలు పెద్దగా కనబడటంలేదు.

అదే జగన్ విషయం చూస్తే ప్రతిపక్షంలో కన్నా ఇప్పుడు నిర్వహిస్తున్న సభలకు జనాల హాజరు ఎక్కువగా ఉంది. మిగిలిన సభలను పక్కనపెట్టినా సిద్ధం ఎన్నికల ప్రచార సభలను చూసినా ఈ విషయం అర్థ‌మైపోతుంది. మొదటి రెండు సిద్ధం సభలకన్నా తాజాగా రాప్తాడులో జరిగిన బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో చంద్రబాబు అండ్ కో లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఎల్లోమీడియాలో బహిరంగసభకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా కనబడలేదు. పైగా జగన్ కు వ్యతిరేకంగా బ్యానర్ కథనాలు అచ్చేశారు.

అంటే సిద్ధం బహిరంగసభకు సంబంధించిన ఫొటోలు, వార్తలు ఎల్లోమీడియా కవర్ చేయలేదంటేనే అర్థ‌మైపోతోంది బహిరంగసభ ఎంతగా సక్సెస్ అయ్యిందో. జనాల స్పందన చూసిన తర్వాత మొత్తం ఎల్లోబ్యాచ్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబు సభంటే ఉన్న ఊరిలోనే జనాలు హాజరుకావటంలేదు. అలాంటిది రాప్తాడు బహిరంగసభకు రాయలసీమలోని అన్నీ నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు, జనాలు హాజరవటమే ఆశ్చర్యంగానే ఉంది. సభకు జనాలు హాజరవ్వటం వేరు స్పందించిన తీరువేరు. జగన్ స్పీచ్ జరిగినంతసేపు జనాల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడింది. జనస్పందన చూసిన తర్వాతే ఎల్లోబ్యాచ్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.

First Published:  19 Feb 2024 11:34 AM IST
Next Story