Taraka Ratna: తారకరత్న అస్వస్థతకు కారణమిదేనా?
Reason behind Taraka Ratna health issues: లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా మొదలైందని డప్పు కొట్టుకునేందుకు ఇరుకు రోడ్డునే ఎంచుకున్నారు. ఒక వైపు ఇరుకు రోడ్డు మరో వైపు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. దీంతో ర్యాలీ మొదలవ్వగానే విపరీతమైన తొక్కిసలాట జరిగింది.
తెలుగుదేశం పార్టీకి ఇంకా జ్ఞానోదయం అయినట్లులేదు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న ప్రాణాపాయస్ధితిలో పడిపోవటానికి భారీ ర్యాలీనే కారణం. కుప్పంలోని వరదరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత భారీ ర్యాలీని లోకేష్ ప్రారంభించారు. ఈ ర్యాలీ దేవాలయం నుండి మసీదు వరకూ జరిగింది. నిజానికి దేవాలయం - మసీదు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. పైగా రోడ్డుకు ఒకవైపు మరమ్మతులు జరుగుతున్నాయి. దాంతో రోడ్డు మరింతగా కుచించుకుపోయింది.
ఇవన్నీ తెలిసికూడా టీడీపీ నేతలు ఇరుకురోడ్డులోనే ర్యాలీని పెట్టుకున్నారు. లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా మొదలైందని డప్పు కొట్టుకునేందుకు ఇప్పుడు కూడా ఇరుకు రోడ్డునే ఎంచుకున్నారు. ఒక వైపు ఇరుకు రోడ్డు మరో వైపు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. దీంతో ర్యాలీ మొదలవ్వగానే విపరీతమైన తొక్కిసలాట జరిగింది. లోకేష్ కంటే సెక్యూరిటి ఉంటుంది మరి తారకరత్నకు ఎందుకుంటుంది. ర్యాలీ మొదలైనపుడు లోకేష్ పక్కనే ఉన్న తారకరత్న తర్వాత కాస్త వెనకబడ్డారు. దాంతో తొక్కిసలాటలో విపరీతమైన సఫొకేషన్ మొదలైపోయిందని సమాచారం.
ఎప్పుడైతే తొక్కిసలాటలో ఇరుక్కుపోయారో ఊపిరాడక ఇబ్బందిపడ్డారట. బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందకపోవటంతో వెంటనే స్పృహతప్పిపడిపోయారు. ఈ కారణంగానే శరీరం బ్లూ కలర్లోకి మారిపోయింది. చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయినా టీడీపీకి బుద్ధిరాలేదని అర్థమవుతోంది. తమ సభలకు, ర్యాలీలకు జనాలు పోలోమంటు వచ్చేస్తున్నారని చెప్పుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఇరుకు సందుల్లో ర్యాలీలు నిర్వహిస్తోందన్న విషయం బయటపడింది.
దేవాలయం నుండి మసీదు వరకు ర్యాలీ తీయటంలో తప్పులేదు. కానీ అందుకు ఆ రోడ్డు అనువుగా ఉందా లేదా అని చూసుకోకపోవటమే తప్పు. ర్యాలీ తీయాలని లోకేష్ అనుకున్నపుడు నేతలు, కార్యకర్తలు ఎక్కువ మంది రాకుండా కంట్రోల్ చేసుండాల్సింది. సమస్య తారకరత్నకు వచ్చింది అత్యుత్తమ వైద్యం అందించి అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటుచేసి బెంగుళూరుకు తరలించారు. అదే తొక్కిసలాటలో కార్యకర్తలో లేకపోతే మామూలు జనాలకో ఇలా జరుగుంటే అప్పుడు ఏమి చేసుండేవారు? వాళ్ళకి కూడా ఇన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుండేవారా? అసలు తొక్కిసలాట జరిగే పరిస్ధితిని ఎందుకు తెచ్చుకోవాలో టీడీపీ ఆలోచించుకుంటే బాగుంటుంది.