Telugu Global
Andhra Pradesh

పరిటాల కుటుంబం ఒంటరైపోయిందా?

వైసీపీకి చెందిన ఒక కార్యకర్త పరిటాల కుటుంబంపై ఆరోపణలు చేస్తే టీడీపీలోని నేతల్లో ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా అందుకు ధీటుగా బదులివ్వలేదు. పైగా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించమని పరిటాల కుటుంబం అడిగినా తమ్ముళ్ళల్లో ఎవరూ స్పందించలేదట.

పరిటాల కుటుంబం ఒంటరైపోయిందా?
X

విషయం చిన్నదే అయినా ప్రభావం మాత్రం భవిష్యత్తులో తీవ్రంగానే ఉండేట్లుంది. వైసీపీకి చెందిన ఒక కార్యకర్త పరిటాల కుటుంబంపై ఆరోపణలు చేస్తే టీడీపీలోని నేతల్లో ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా అందుకు ధీటుగా బదులివ్వలేదు. పైగా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించమని పరిటాల కుటుంబం అడిగినా తమ్ముళ్ళల్లో ఎవరూ స్పందించలేదట. దీంతోనే జిల్లాలో పరిటాల కుటుంబం ఏకాకి అయిపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు తో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై పరిటాల శ్రీరామ్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దానికి గుంటూరు వైసీపీకి చెందిన హరికృష్ణారెడ్డి అనే అభిమాని సోషల్ మీడియాలో ఓ రేంజిలో శ్రీరామ్‌పై విరుచుకుపడ్డాడు. రెండు రోజులు ఇలా జరిగిన తర్వాత టీడీపీలో ఎవరో హరిని చాలెంజ్ చేశారు. గుంటూరులో కూర్చుని పరిటాల కుటుంబంపై మాట్లాడటం కాదని దమ్ముంటే అనంతపురం వచ్చి మాట్లాడితే తామేంటో తెలుస్తుందని వార్నింగ్ ఇచ్చాడు.

అయితే మరుసటి రోజే సోషల్ మీడియాలో మళ్ళీ పరిటాల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోస్టులు కనిపించాయి. పైగా పరిటాల స్వగ్రామమైన వెంకటాపురంలో ఫొటోలు, అనంతపురం క్లాక్ టవర్ ఫొటోలు, టీడీపీ ఆఫీసు ఫొటోలు అన్నీ కనిపించాయి. అంటే హరి కృష్ణారెడ్డి అనే కుర్రాడు చాలెంజ్‌ని చాలెంజ్‌గా తీసుకుని మరుసటి రోజే అనంతపురం వచ్చేశాడు. లైవ్‌లో పరిటాల ఫ్యామిలీపై ఆరోపణలు చేయటమే కాకుండా వెంకటాపురం, క్లాక్ టవర్, టీడీపీ ఆఫీసు అన్నింటి దగ్గర తాను తిరుగుతున్నట్లు ఫొటోలు, వీడియోలు కూడా పోస్టు చేశాడు.

దాంతో పరిటాల ఫ్యామిలీకి ఏమిచేయాలో అర్థంకాలేదట. తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇవ్వాలని కోరినా తమ్ముళ్ళెవరూ పట్టించుకోలేదట. తాము రంగంలోకి దిగితే ఏమవుతుందో అన్న ఆలోచనతో పరిటాల శ్రీరామ్ కూడా ఏమీ మాట్లాడలేదట. తమపైన వచ్చిన ఆరోపణలకు తాము సమాధానం చెప్పుకోవటం కాకుండా ఇతరులు ఖండిస్తే బాగుంటుందనేది సునీత ఆలోచన. అయితే అందుకు ఎవరు సానుకూలంగా స్పందించకపోవటంతో గుంటూరు నుండి వచ్చిన కుర్రాడు హ్యాపీగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం చిన్నదే అయితే పరిటాల ఫ్యామిలీ అడిగినా కూడా తమ్ముళ్ళల్లో ఎవరు ఎందుకు ముందుకు రాలేదన్నదే చాలా కీలకం.

First Published:  9 March 2023 6:19 AM GMT
Next Story