Telugu Global
Andhra Pradesh

రుషికొండ వద్ద నిర్మాణం సీఎం క్యాంప్ ఆఫీసేనా?

తాజాగా నిర్మాణాల విషయంలో అనుమతుల కోసం జీవీఎంసీకి చేసుకున్న దరఖాస్తులో అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్స్ అని ఉండడంపై ప్రతిపక్ష పార్టీ అనుకూల పత్రికలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

రుషికొండ వద్ద నిర్మాణం సీఎం క్యాంప్ ఆఫీసేనా?
X

రుషికొండ వద్ద ఇటీవల ఏపీ ప్రభుత్వం పర్యాటక ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం కొండను కొద్ది మేర తొలిచారు కూడా. దీనిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కోర్టుకు కూడా వెళ్లారు. పనులు చేసుకునేందుకు కోర్టు ఇది వరకు అనుమతి ఇచ్చింది. అయితే అక్కడ నిర్మిస్తున్నది పర్యాటక ప్రాజెక్టు కాదని.. సీఎం క్యాంపు కార్యాలయం అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

నిర్మిస్తున్న భవనాలు కూడా పర్యాటన ప్రాజెక్టు తరహాలో కాకుండా పరిపాలన భవనాల తరహాలో ఉన్నాయని విమర్శలు చేస్తోంది. తాజాగా నిర్మాణాల విషయంలో అనుమతుల కోసం జీవీఎంసీకి చేసుకున్న దరఖాస్తులో అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్స్ అని ఉండడంపై ప్రతిపక్ష పార్టీ అనుకూల పత్రికలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

కేవలం పర్యాటక రంగానికి అవసరమైన భవనాలు నిర్మిస్తామని చెప్పి.. ఇప్పుడు దరఖాస్తులో మాత్రం ''పరిపాలన భవనాలు'' అంటూ జీవీఎంసీ నుంచి అనుమతులు ఎలా తీసుకుంటున్నారని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అక్కడ జరుగుతున్నది పర్యాటక రంగానికి సంబంధించిన నిర్మాణాలేనని.. కొందరు ఏదేదో ఊహించుకుని వాటికి సమాధానం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  13 Sept 2022 7:15 AM IST
Next Story