బీజేపీతో టీడీపీ పొత్తు ఓకే అయిందా.. డీల్ ఇదేనా.?
ఇప్పటివరకూ ఈ పొత్తుపై మూడు పార్టీల నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమకు పొత్తు విషయం తెలియదని దాటవేస్తున్నారు.
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పొత్తు చర్చలు కొలిక్కి వచ్చినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. పొత్తుల విషయమై చర్చించేందుకు మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్తారని తెలుస్తోంది.
బీజేపీ-జనసేనకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లు సమాచారం. 30 అసెంబ్లీ స్థానాల్లో 5-10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని..మిగతా స్థానాలు జనసేనకు వదిలిపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఇక 10 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఏడు స్థానాల్లో పోటీ చేయనుందని..మిగతా మూడు స్థానాలను జనసేనకు వదిలివేయనుందని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకూ ఈ పొత్తుపై మూడు పార్టీల నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమకు పొత్తు విషయం తెలియదని దాటవేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ సింగిల్‌గా అభ్యర్థులను ప్రకటిస్తూ సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తులపై తేల్చుకోలేక అభ్యర్థులను ప్రకటించలేక గందరగోళంలో ఉన్నారు.