Telugu Global
Andhra Pradesh

జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారా..?

ఎన్నికల్లోపు వివేకా హత్య కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చి అవినాష్ పాత్రలేదని తేలితే ఓకే.. లేకపోతే ఎంపీగా అభిషేక్ ను పోటీచేయించాలని జగన్ అనుకున్నట్లు టాక్ వినబడుతోంది.

జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారా..?
X

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముందుజాగ్రత్త పడుతున్నట్లున్నారు. పార్లమెంటు ఎన్నికలంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కడప సీటు గురించే. వచ్చేఎన్నికల్లో కడప లోక్ సభ నుంచి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు సమాచారం. అభిషేక్ రెడ్డి అంటే జగన్ కు దగ్గర బంధువే. వైజాగ్ లో డాక్టర్ వృత్తిలో ఉన్న అభిషేక్ ను దాదాపు ఏడాది క్రితమే పులివెందులకు పిలిపించారు. నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం మండలాలకు ఇన్చార్జిగా నియమించారు.

ఏ కారణం వల్లనైనా ఇప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి పోటీనుండి తప్పుకోవాల్సొస్తే అప్పుడు అభిషేక్ రెడ్డి పోటీచేస్తారని పార్టీ వర్గాల సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ పై బాగా ఆరోపణలున్న విషయం తెలిసిందే. వివేకా హత్యలో అవినాష్ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినా సరే ప్రతిపక్షాలు+ఎల్లోమీడియా మాత్రం అవినాష్ ను నిందితుడి కాదు ఏకంగా దోషిగా ముద్రేశాయి. వివేకా కూతురు సునీత కూడా ఇందుకు యథాశక్తి తోడ్పడ్డారు. దాంతో అవినాష్ పై అనుమానాలు పెరిగిపోయాయి.

ఎన్నికల్లోపు వివేకా హత్య విచారణ ఒక కొలిక్కి వచ్చి అవినాష్ పాత్రలేదని తేలితే ఓకే లేకపోతే ఎంపీగా అభిషేక్ ను పోటీచేయించాలని జగన్ అనుకున్నట్లు టాక్ వినబడుతోంది. వివేకా హత్యలో అవినాష్ పాత్రపై కోర్టులో తేలకుండానే మళ్ళీ ఎంపీగా పోటీచేయిస్తే ఇబ్బంది అవుతుందేమో అని జగన్ అనుకుంటున్నారట. అనవసరంగా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకనే స్టాండ్ బై గా డాక్టర్ ను రెడీ చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే అవినాష్ మాత్రం పోటీకి సిద్ధంగా ఉన్నారట.

అభిషేక్ రెడ్డి అభ్యర్థి అయితే ప్రత్యేకించి ఆరోపణలు చేయటానికి ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాకు ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే అభిషేక్ రాజకీయాలకే కొత్త కాబట్టి. పోటీకి అవినాష్ సిద్ధంగానే ఉన్నా జగన్ ఆలోచనే వేరేగా ఉన్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు ఆప్షన్లున్నాయట. అవేమిటంటే జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలను అవినాష్ కు అప్పగించబోతున్నారని. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీచేయించబోతున్నారన్నది రెండో సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  2 Jan 2024 10:22 AM IST
Next Story