Telugu Global
Andhra Pradesh

చంద్రబాబులో ఇరిటేషన్ పెరిగిపోతోందా?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో ఇరిటేషన్ పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.

Chandrababu Naidu
X

చంద్రబాబునాయుడు

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో ఇరిటేషన్ పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఇందులో ఎలాంటి దాపరికం లేకుండా జగన్ ఆ విషయాన్ని బాహాటంగానే ప్రకటించేశారు. ప్రతి సమావేశంలోను కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే 175కి 175 సీట్లూ వైసీపీనే గెలుస్తుందని జగన్ పదే పదే చెబుతున్నారు.

ఈ నేపధ్యంలోనే శుక్రవారం కుప్పం పర్యటనలో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేయబోయే ఎంఎల్సీ భరత్ ను గెలిపించాలని చంద్రబాబును ఓడించాలని పిలుపిచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారా లేదా అన్నది వేరే విషయం. కానీ తనను ఓడగొట్టాలని జగన్ పదే పదే చెప్పటాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. పైగా తాను 35 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు వచ్చి ముఖ్యమంత్రిగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని చెప్పటం చంద్రబాబుకు ఇరిటేటింగ్ గా అనిపిస్తోంది.

తాను ఓడిపోతాను అనే విషయం కన్నా ఓటమికి జగన్ డైరెక్టుగానే పావులు కదుపుతున్నారన్న విషయాన్నే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్ కుప్పానికి నాన్ లోకల్ అన్న జగన్ మాట జనాల్లో బాగా నాటుకుపోయింది. కుప్పం నుండి చాలా తీసుకున్న చంద్రబాబు కుప్పానికి మాత్రం ఏమీ చేయలేదని సూటిగా చెప్పటం జనాల్లో ఆలోచన రేకెత్తించేదే.

హంద్రీ-నీవా కెనాల్ పూర్తి చేయటం ద్వారా కుప్పం దాహార్తిని తీర్చాలంటే చంద్రబాబుకు పెద్ద పనేమీకాదు. కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండికూడా ఆ పనిచేయలేదంటే కావాలనే ఆపని పూర్తి చేయలేదని జనాలకు అర్ధమవుతోంది. సంవత్సరాలుగా కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవిన్యు డివిజన్ గా చేయాలనే డిమాండ్లను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో జగన్ అధికారంలోకి రాగానే జనాల డిమాండు ప్రకారం కుప్పాన్ని మున్సిపాలిటిగా చేశారు.

అలాగే కుప్పాన్ని రెవిన్యు డివిజన్ గా చేశారు. విచిత్రం ఏమిటంటే కుప్పాన్ని రెవిన్యు డివిజన్ గా చేయాలన్న జనాల డిమాండ్ ను వెంటనే జగన్ ఆమోదించాలని స్వయంగా చంద్రబాబే లేఖరాయటం. నిజంగానే జనాలు ఎప్పటినుండో డిమాండు చేస్తుంటేమరి ఆపని చంద్రబాబే ఎందుకు చేయలేదు ? పైగా తాను చేయని పనిని చేయాలని జగన్ను డిమాండ్ చేయటం ఏమిటో? ఇక్కడే చంద్రబాబు చేతకానితనం అర్ధమైపోతోంది. దీన్నే కుప్పం బహిరంగసభలో జగన్ ఎత్తిచూపారు. దీంతో చంద్రబాబులో ఇరిటేషన్ పెరిగిపోతున్నట్లే ఉంది.

First Published:  24 Sept 2022 12:47 PM IST
Next Story