Telugu Global
Andhra Pradesh

రాధాను కంట్రోల్ చేయలేకపోతున్నారా..?

రాధా విషయమనే కాదు కల్యాణదుర్గం, మడకశిర, పుంగనూరు, నెల్లూరు, కొవ్వూరు లాంటి నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం కుర్చీలతోనే కొట్టేసుకున్నారు. అయినా ఎవ్వరిమీదా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.

రాధాను కంట్రోల్ చేయలేకపోతున్నారా..?
X

చంద్రబాబు చేతకానితనానికి ఇదే తాజా నిదర్శనం. పార్టీలోని నేతల్లో ఎవరినీ ఏమీ అనలేని నిస్సహాయత. ఎంతసేపు క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేదిలేదని బెదిరింపులతోనే సరిపెడతారు కానీ, ఎవరిపైనా ఇంతవరకు యాక్షన్ తీసుకున్నదిలేదు. పార్టీకి ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబును ఎవరిమీద కూడా యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడుతోంది. ఇంతోటిదానికి తాను లేస్తే మనిషిని కానంటూ గోలగోల చేస్తుంటారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నేత. అయితే ఆయన భేటీలన్నీ ఎక్కువగా వైసీపీ నేతలతోనే. రాధా ఎప్పుడుచూసినా కొడాలి నాని, వల్లభనేని వంశీలతోనే ఉంటారు. వంశీ గెలిచింది టీడీపీ తరపునే అయినా ఉంటున్నది వైసీపీలోనే. ఒకసారి కాదు రెగ్యులర్ గా రాధాది ఇదేతంతు. టీడీపీ నేతయ్యుండి వైసీపీతో అంటకాగటం ఏమిటంటూ చంద్రబాబు ఒక్కసారి కూడా రాధాను నిలదీయలేదు. విచిత్రం ఏమిటంటే టీడీపీ నేతలతో రాధా భేటీలు అయ్యేది చాలా తక్కువ.

రాధా విషయమనే కాదు కల్యాణదుర్గం, మడకశిర, పుంగనూరు, నెల్లూరు, కొవ్వూరు లాంటి నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం కుర్చీలతోనే కొట్టేసుకున్నారు. అయినా ఎవ్వరిమీదా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కోవర్టులుగా మారిపోయి వైసీపీకి పనిచేశారని చాలాచోట్ల ఆధారాలతో సహా రిపోర్టులిచ్చారు కొంతమందిపై. అందరితోను మీటింగులు పెట్టి పార్టీలోని కోవర్టులను ఏరేస్తానంటూ సీరియస్ వార్నింగులిచ్చారు. అయితే ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ముగ్గురు నేతలు జట్టుకట్టి పార్టీ పరువును రోడ్డున పడేసినా ఎవరిపైనా యాక్షన్ లేదు.

నెల్లూరులో ముగ్గురిపైన సస్పెన్షన్ వేటు వేశారుకానీ వాళ్ళు హ్యాపీగా పార్టీలోనే ఉన్నారు, చంద్రబాబును కలుస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తీసుకుంటే గుంటూరు జిల్లాలో రావి వెంకటరమణ, నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బరాయుడును సస్పెండ్ చేసి పార్టీలో నుండి పంపేశారు. ఒక్కళ్ళిద్దరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే మిగిలిన నేతలు భయపడతారు. అంతేకానీ ఎంతసేపు మాట‌లు చెబుతు, బెదిరిస్తు కాలాన్ని నెట్టుకు రావాలంటే సాధ్యంకాదు.

First Published:  26 Dec 2022 11:14 AM IST
Next Story