Telugu Global
Andhra Pradesh

డ్యామేజంతా చంద్రబాబు వల్లే జరిగిందా..?

వైజాగ్ కు ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేది లేదు దక్షిణ కోస్తా రైల్వేజోన్ మాత్రమే ఇస్తామంటే డూడూ బసవన్న లాగ అంగీకరించింది కూడా చంద్రబాబే.

డ్యామేజంతా చంద్రబాబు వల్లే జరిగిందా..?
X

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ విషయాన్ని ఎల్లోమీడియా ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్లుగా బురదజ‌ల్లేసింది. పదేళ్ళుగా కేంద్ర బడ్జెట్ తో పాటు విభజన హామీల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉన్నా, ఒక్కసారి కూడా జగన్ ధైర్యంగా నిలదీయలేదట. ‘నాడు రంకెలు.. నేడు సలాములు’ అనే హెడ్డింగు పెట్టి పేద్ద స్టోరీ అచ్చేసింది. అందులో విభజన హామీలను నెరవేర్చమని పదేళ్ళల్లో జగన్ ఒక్కసారి కూడా కేంద్రాన్ని నిలదీయలేదని తెగ బాధపడిపోయింది. రాజకీయాలతో సంబంధంలేని వాళ్ళు స్టోరీ చదివి పదేళ్ళుగా అధికారంలో జగనే ఉన్నారని అనుకోవాలన్నది ఎల్లోమీడియా ఆలోచన.

పదేళ్ళలో మొదటి ఐదేళ్ళు అధికారంలో ఉన్నది చంద్రబాబే అని స్టోరీలో ఎల్లోమీడియా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతటి దరిద్రపు జర్నలిజం ఎల్లోమీడియాకు మాత్రమే సాధ్యం. విభజన హామీలను రాబట్టడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఫెయిలయ్యారంటే అందులో తప్పుపట్టాల్సిన అవసరంలేదు. అసలు ఏపీకి జరిగిన డ్యామేజిలో చంద్రబాబు పాత్రే ఎక్కువ. ప్రత్యేకహోదా అవసరంలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని సంతకం పెట్టిందే చంద్రబాబు. పోనీ ప్రత్యేక ప్యాకేజీ అయినా సాధించారా..? అంటే అదీలేదు. ఎన్డీయేలో ఉన్నంతవరకు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని చెప్పి బయటకు వచ్చాక ప్యాకేజీ కాదు హోదాయే కావాలని యూటర్న్ తీసుకున్నారు.

వైజాగ్ కు ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేది లేదు దక్షిణ కోస్తా రైల్వేజోన్ మాత్రమే ఇస్తామంటే డూడూ బసవన్న లాగ అంగీకరించింది కూడా చంద్రబాబే. ఇక కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టును కమీషన్లు కోసం బలవంతంగా లాక్కున్నది కూడా చంద్రబాబే.

ఐదేళ్ళల్లో ఏపీకి చేయాల్సిన డ్యామేజీని చంద్రబాబు చేసేసిన తర్వాత ఇక జగన్ ఏమి చేయగలరు..? విభజన హామీలను రాబట్టడంలో జగన్ ఫెయిలయ్యారా..? అంటే అయ్యారనే చెప్పాలి. కానీ అందుకు మొదటి బాధ్యుడు చంద్రబాబే. ఆ విషయాన్ని ఎల్లోమీడియా దాచి మొత్తం చెత్తంతా జగన్ నెత్తిన వేస్తానంటే జనాలకు వాస్తవాలు తెలీదా..? తనపైన ఉన్న కేసుల భయానికే జగన్ కేంద్రాన్ని నిలదీయటంలేదని చెప్పింది. జగన్ కేసులకు భయపడి కేంద్రాన్ని నిలదీయటంలేదు సరే, మరి చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని నిలదీయటంలేదో ఎల్లోమీడియా చెప్పాలి కదా.

First Published:  2 Feb 2024 11:16 AM IST
Next Story