కోర్టును మ్యానేజ్ చేసిందెవరు?
ప్రతివాదాల్లో నోటీసులు అందిన వాళ్ళెవరు? అందని వాళ్ళెవరో కూడా లిస్టు ఇవ్వమని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని జడ్జి ఆదేశించినా కూడా ఎవరో కోర్టు స్టాఫ్‌ను నోటీసులు ఇవ్వకుండా మ్యానేజ్ చేసినట్లు అర్థమవుతోంది.
ఈ మధ్య వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు తరచూ వినబడుతున్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టయి 53 రోజులు రిమాండులో ఉండటంతో భువనేశ్వరి, లోకేష్‌తో పాటు తమ్ముళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మ్యానేజ్ చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారంటు పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటరుగా మంత్రులు, వైసీపీ నేతలు వ్యవస్థలను మ్యానేజ్ చేయటంలో చంద్రబాబుకు మించినవాళ్ళు ఎవరున్నారని సెటైర్లు వేస్తున్నారు.
ఒకరి మీద మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా తాజాగా హైకోర్టుకే కొందరు ఘనులు షాకిచ్చారు. ఈ విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ విచారణ సందర్భంగా బయటపడింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయిన తర్వాత ఉండవల్లి ఒక పిటీషన్ వేశారు. దేనికంటే స్కిల్ స్కామ్ మూడు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి, ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వెంటనే కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.
దాదాపు నెల రోజుల క్రితం ఉండవల్లి వేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. విచారణ మొదలవ్వగానే లాయర్లు చెప్పిన విషయం విని జడ్జికి షాక్ తగిలినట్లయ్యింది. ఇంతకీ ఏమైందంటే నెల రోజుల క్రితం పిటీషన్ను అడ్మింట్ చేసుకున్న కోర్టు ఉండవల్లి కోరినట్లుగానే చంద్రబాబు, అచ్చెన్నాయడు తదితరులు 44 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులకు 44 మంది నుండి రిప్లై వచ్చుంటుందని కోర్టు అనుకున్నది. అయితే విచారణ మొదలవ్వగానే చాలామంది నుండి సమాధానమే రాలేదని లాయర్లు చెప్పారు. ఎందుకని జడ్జి అడిగితే చాలామందికి అసలు నోటీసులే వెళ్ళలేదని సమాధానం వచ్చింది.
దాంతో జడ్జి విస్తుపోయారు. నోటీసులు జారీ చేయమని నెలరోజుల క్రితం చెప్పినా ఇంకా చాలామందికి నోటీసులు ఎందుకు అందలేదని అడిగారు. నోటీసులు పంపలేదు కాబట్టే ప్రతివాదుల్లో చాలామందికి నోటీసులు అందలేదని లాయర్లు సమాధానం చెప్పటంతో జడ్జి మండిపోయారు. నోటీసులు పంపమని ఆదేశించినా ఎందుకు పంపలేదు? అందుకు బాధ్యులెవరో వెంటనే తనకు తెలియాలని రిజిస్ట్రీని జడ్జి ఆదేశించారు. అలాగే ప్రతివాదాల్లో నోటీసులు అందిన వాళ్ళెవరు? అందని వాళ్ళెవరో కూడా లిస్టు ఇవ్వమని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని జడ్జి ఆదేశించినా కూడా ఎవరో కోర్టు స్టాఫ్‌ను నోటీసులు ఇవ్వకుండా మ్యానేజ్ చేసినట్లు అర్థమవుతోంది. దీంతో కోర్టు స్టాఫ్‌నే మ్యానేజ్ చేసిన ఘనలు ఎవరనేది ఆసక్తిగా మారింది.