ఏపీలో ముమ్మర తనిఖీలు.. ఇప్పటి వరకు రూ.100 కోట్ల సొత్తు స్వాధీనం
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీనా చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకొస్తున్న వస్తువులనూ స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు.
ఎన్నికల సందర్భంగా ఏపీలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగలు, నగదు, మద్యం వంటివి అక్రమ రవాణా జరగకుండా చూస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు.
రూ.100 కోట్ల సొత్తు స్వాధీనం
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీనా చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకొస్తున్న వస్తువులనూ స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల వద్ద నుంచి సమాచారం తీసుకుని.. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్లు వెల్లడించారు.
తనిఖీల్లో భాగంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించినట్లు మీనా తెలిపారు. సొత్తు స్వాధీనం చేసుకున్నా, ఆధారాలు చూపిస్తే వెంటనే విడిచిపెడుతున్నామని చెప్పారు.