జగన్‌కూ జడ్ ప్లస్ సెక్యూరిటీ..?
ప్రస్తుతం జగన్ భద్రతలో షిఫ్టుల ప్రకారం 24 గంటలూ 30 మంది ఆక్టోపస్ లో యాంటీ టెర్రరిజంలో శిక్షణపొందిన భద్రతాసిబ్బంది కాపలా ఉన్నారు. వీళ్ళకి అదనంగా రెగ్యులర్ పోలీసులు సుమారు 100కి పైగా కాపలాగా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డికి కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు లేఖరాసినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి ఉగ్రవాదుల నుంచి ముప్పుందన్న సమాచారంతోనే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు సీఎంకు జడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరమని తేల్చారట. అందుకనే ఇప్పుడున్న భద్రతను మరింత పటిష్టంగా మార్చటంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరమని నిర్ణయించారని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ కు పటిష్టమైన భద్రత ఉంది.
మామూలు పోలీసులతో పాటు ఆక్టోపస్ లో శిక్షణ పొందిన మెరికల్లాంటి భద్రతాదళంతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ భద్రతా సిబ్బంది కూడా రక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే వీళ్ళకి అదనంగా జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా అవసరమని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు భావించారట. అందుకనే వెంటనే ఈ విషయం కేంద్రహోంశాఖకు రిపోర్టు పంపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం జగన్ భద్రతలో షిఫ్టుల ప్రకారం 24 గంటలూ 30 మంది ఆక్టోపస్ లో యాంటీ టెర్రరిజంలో శిక్షణపొందిన భద్రతాసిబ్బంది కాపలా ఉన్నారు. వీళ్ళకి అదనంగా రెగ్యులర్ పోలీసులు సుమారు 100కి పైగా కాపలాగా ఉన్నారు. రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిందట. ఎన్నికల కాలం కాబట్టి జగన్ రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని ఏవోబీ ప్రాంతంలో కూడా ఎక్కువగా పర్యటనలు చేయాల్సుంటుంది.
ఏవోబీ అంటేనే మావోయిస్టుల ఉనికి బలంగా ఉన్న ప్రాంతాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖపట్నం జిల్లాలో ఒడిశా సరిహద్దులను ఆనుకుని చాలా నియోజకవర్గాలు ఏవోబీ ప్రాంతంలోకే వస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించాల్సుంటుంది.
అందుకనే ముందుజాగ్రత్తగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు అవసరమని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారట. మామూలుగా ముఖ్యమంత్రులు, తీవ్రవాదుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వాళ్ళకి కేంద్రహోంశాఖ జడ్ లేదా జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు జగన్ కు జడ్ కేటగిరి ఉంది. తాజాగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల రిపోర్టుతో జడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చే అవకాశముంది.