Telugu Global
Andhra Pradesh

టీడీపీ పరువు తీసిన సర్వే

ఇంతకీ దాని క్రెడిబులిటి ఏమిటంటే.. 2014 ఎన్నికల్లో ఏపీ సర్వే అంచనా ఫెయిలైందట. 2018లో తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని చెప్పిందట. అయితే కేసీఆర్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2019లో ఏపీ ఎన్నికల్లో టీడీపీదే ఘనవిజయమని చెప్పింది.

టీడీపీ పరువు తీసిన సర్వే
X

రెండురోజుల క్రితం ఒక జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్ సర్వేను రిలీజ్ చేసింది. ఇండియా టుడే-సీ ఓటర్ పేరుతో రిలీజైన సర్వే 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో 47 శాతం ఓట్ షేరుతో టీడీపీ+జనసేన కూటమికి 17 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీకి 41 శాతం ఓట్ల షేర్ తో ఎనిమిది సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. దీనిపైన ‘మూడ్ మారుతోంది.. టీడీపీదే అధికారం’ అని ఎల్లోమీడియా రెచ్చిపోయింది. విచిత్రం ఏమిటంటే.. టీడీపీకి 47 శాతం ఓట్ షేరట, జనసేనకు ఏడుశాతం ఓట్లు వస్తాయట.

అంటే టీడీపీ మిత్రపక్షం జనసేనకు పోయిన ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు మధ్య ఓట్ల శాతం పెద్దగా పెరగలేదని చెప్పటమే ఇండియా టుడే-సీ ఓటర్ ఉద్దేశ్యంలాగుంది. దీని ఉద్దేశ్యం ఎలాగున్నా అసలు ఇండియా టుడే-సీ ఓటర్ సంస్థ‌లకున్న విశ్వసనీయత ఎంత అన్న విషయమై పెద్ద డిబేటే నడుస్తోంది. పాత పురాణాలన్నింటినీ తవ్వి బయటకు తీసి ఆ సంస్థ‌ క్రెడిబులిటి ఇది అని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు. టీడీపీ డబ్బులిచ్చి సర్వే చేయించుకున్నదని నెటిజన్లంటున్నారు. టీడీపీ తరఫున సర్వే చేసి రిలీజ్ చేసిన ఫేక్ సర్వే అని నెటిజన్లు ఫైనల్ చేసేశారు.

ఇంతకీ దాని క్రెడిబులిటి ఏమిటంటే.. 2014 ఎన్నికల్లో ఏపీ సర్వే అంచనా ఫెయిలైందట. 2018లో తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని చెప్పిందట. అయితే కేసీఆర్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2019లో ఏపీ ఎన్నికల్లో టీడీపీదే ఘనవిజయమని చెప్పింది. అయితే 151 సీట్ల అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందని సర్వే తేల్చింది. అయితే సింపుల్ మెజారిటీతోనే అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో కూడా ఇండియా టుడే-సీ ఓటర్ ప్రెడిక్షన్ ఫెయిలైనట్లు నెటిజన్లు వాయించేస్తున్నారు.

తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో చెప్పిందంటే కచ్చితంగా వైసీపీదే మళ్ళీ అధికారమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక సంస్థ‌ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగానే ఎల్లోమీడియా వీరలెవల్లో రెచ్చిపోయి ఫ్రంట్ పేజీలో వార్తను అచ్చేయటంపైన కూడా నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఒక్క సంస్థ‌ టీడీపీకి అత్యధిక ఎంపీ సీట్లు వస్తుందని చెప్పిందే నిజమైతే టైమ్స్ నౌ, లోక్ పోల్ లాంటి 13 సంస్థ‌లు వైసీపీనే అత్యధిక సీట్లు సాధిస్తుందని, అధికారంలోకి వస్తుందని చెప్పటాన్ని ఏమనాలంటూ నిలదీస్తున్నారు.

First Published:  10 Feb 2024 2:41 PM IST
Next Story