చివరకు కండోమ్‌లనూ వదలటంలేదా..?
సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా బుర్రకుతోచినట్లు చాలా నీచమైన పోస్టింగులు పెడుతున్నారు. దేశమంతా ఇలాగే ఉందో లేదో తెలీదు కానీ, ఏపీలో మాత్రం రాజకీయాలు చాలా అసహ్యంగా తయారయ్యాయి.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేయడం చాలా సహజం. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను గబ్బుపట్టించేందుకు చాలా చవకబారుగా వ్యవహరిస్తూ బురదలో కూరుకుపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ తరఫున కండోమ్ ప్యాకెట్లతో పార్టీల ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ముందుగా ఎవరు ప్రారంభించారంటే చెప్పటం కష్టమే.
వైసీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వెంటనే తెలుగుదేశంపార్టీ పేరుతో కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కండోమ్ ప్యాకెట్లపై వైసీపీ జెండా రంగులతో, ఫ్యాన్ గుర్తుతో, సిద్ధం అని రాసుంది. అలాగే పసుపు రంగులో టీడీపీ అని రాసి, పార్టీ గుర్తుతో భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసున్న కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అయితే కండోమ్ ప్యాకెట్లపైన తమ పార్టీ గుర్తులను ముద్రించుకుని ప్రచారం చేసేంత స్థాయికి దిగజారిపోతాయని ఎవరు అనుకోవటంలేదు. కండోమ్ అన్న పదాన్ని ఇప్పటికీ సమాజం నెగిటివ్ కోణంలోనే చూస్తోంది కాబట్టి.
ఇలాంటి నేపథ్యంలో కండోమ్ ప్యాకెట్లపై పార్టీ గుర్తును ముద్రించుకుని ఎవరైనా అభ్యర్థి ప్రచారం చేసుకుంటే నెగిటివ్ రిజల్టే వస్తుందనే భయం ఉంది. అందుకనే ఇలాంటి ప్రచారానికి పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉంటారనే చెప్పచ్చు. మరైతే సోషల్ మీడియాలో రెండుపార్టీల పేర్లతో కండోమ్ ప్యాకెట్లతో ఎవరు ప్రచారం చేస్తున్నట్లు..? ఇప్పుడిదే పెద్ద ప్రశ్నగా మారింది. వైసీపీ-టీడీపీ మధ్య గొడవలు, దూషణలు అన్నీ హద్దులను దాటేస్తున్నాయి. ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటే అభ్యంతరాలుండవు. కానీ ప్రత్యర్థిని గబ్బుపట్టించే ఉద్దేశ్యంతో ఒకపార్టీ మరో పార్టీపైన బురదచల్లేస్తోంది.
సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా బుర్రకుతోచినట్లు చాలా నీచమైన పోస్టింగులు పెడుతున్నారు. దేశమంతా ఇలాగే ఉందో లేదో తెలీదు కానీ, ఏపీలో మాత్రం రాజకీయాలు చాలా అసహ్యంగా తయారయ్యాయి. దీనికి ప్రధాన కారణం మీడియా అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీద ధ్వేషంతో మెజారిటీ మీడియా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచింది. దాంతోనే రాజకీయాలు గబ్బుపట్టిపోయాయి. మీడియా గనక న్యూట్రల్ గా ఉండుంటే రాజకీయాలు ఇంతగా భ్రష్టుపట్టుండేవి కావేమో. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైన కండోమ్ ప్రచారం మాత్రం దిగజారుడు రాజకీయానికి పరాకాష్టనే చెప్పాలి.