శ్రీవాణి ట్రస్ట్ @రూ. వెయ్యి కోట్లు
ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ విరాళాల మొత్తం వెయ్యి కోట్లకు చేరింది. 2020లో 70.21 కోట్ల రాగా.. 2021లో రూ.176 కోట్లు, 2022లో 282.64 కోట్లు, 2023లో ఇప్పటి వరకు రూ. 268.35 కోట్లు ట్రస్ట్‌కు వచ్చింది.
నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్దరణ కోసం టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ విజయవంతంగా కొనసాగుతోంది. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10వేలు ఇస్తే ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. 2019 సెప్టెంబర్ 23 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. అంతకు ముందు లక్ష రూపాయలకు పైగా విరాళం ఇచ్చిన వారికి మాత్రమే ఈ తరహా దర్శనం కల్పించేవారు. నాలుగేళ్లుగా 10వేలకే ప్రోటోకాల్ దర్శనం లభిస్తుండటంతో చాలా మంది విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ విరాళాల మొత్తం వెయ్యి కోట్లకు చేరింది. 2020లో 70.21 కోట్ల రాగా.. 2021లో రూ.176 కోట్లు, 2022లో 282.64 కోట్లు, 2023లో ఇప్పటి వరకు రూ. 268.35 కోట్లు ట్రస్ట్‌కు వచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రోజుకు 500, ఆఫ్‌లైన్‌లో 400, తిరుపతి ఎయిర్‌పోర్టులో 100 టికెట్లను కేటాయిస్తున్నారు. తొలి రోజుల్లో రోజుకు 2700 మంది వరకు 10వేల రూపాయలు విరాళం చెల్లించి ప్రోటోకాల్ దర్శనం కోసం వచ్చేవారు. దాంతో సామాన్యులకు సందర్శం ఆలస్యం అవుతుండటంతో ప్రస్తుతం రోజుకు వెయ్యి మందికి మాత్రమే ఈ తరహా దర్శనాన్ని పరిమితం చేశారు. దాంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు వచ్చే గరిష్ట విరాళాల మొత్తం రూ.30కోట్లకు పరిమితం అయింది.
ఈ ట్రస్ట్ విరాళాలతో ఇప్పటి వరకు 176 పురాతన ఆలయాలను పునరుద్దరించినట్టు టీటీడీ వెల్లడించింది. 2,273 నూతన ఆలయాలను నిర్మించారు. 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ. 5వేల చొప్పున అందిస్తున్నారు.
*