Telugu Global
Andhra Pradesh

రుషికొండపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

తవ్వకాలపై సర్వే కోసం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి రాష్ట్ర అధికారులను తొలగించి కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

రుషికొండపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
X

రుషికొండపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖ రుషికొండ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తవ్వకాలపై సర్వే కోసం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ముగ్గురు రాష్ట్ర అధికారులను తొలగించాలని ఆదేశించింది. ఇది వరకు తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అందులో రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.

కమిటీ కూర్పు కేవలం కంటితుడుపు చర్యగా ఉందని అభివర్ణించింది. కాబట్టి కమిటీ నుంచి రాష్ట్ర అధికారులను తొలగించి కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త కమిటీలో నియమించే సభ్యుల వివరాలను ముందుగా హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన కమిటీ జనవరి 31లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈమేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

రుషికొండ వద్ద టూరిజం ప్రాజెక్టు పేరుతో అనుమతి తీసుకున్న విస్తీర్ణం కంటే అధికంగా కొండను తవ్వేశారంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది.

First Published:  22 Dec 2022 2:40 PM IST
Next Story