విశాఖ సంఘటనలపై స్పందించిన బీజేపీ - పోలీసులపై ఆగ్రహం
విశాఖలో జనసేన నాయకులు , కార్యకర్తల అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఖండించారు. వారిపై కేసులు ఎత్తివేసి తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
BY Telugu Global16 Oct 2022 11:09 AM
X
Telugu Global Updated On: 16 Oct 2022 11:09 AM
విశాఖపట్నంలో నిన్న జరిగిన ఘటనలకు అధికార పార్టీయే బాధ్యత వహించాలని బీజేపీ వ్యాఖ్యానించింది. జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల బీజేపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారంనాడు మంత్రులపై జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు పితాని సత్యనారాయణ, పంతం నానాజీ తదితర జనసేన అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులను తక్షణం ఎత్తివేయాలని, వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తన పద్దతి మార్చుకోకపోతే జనసేనతో కలిసి తమ పార్టీ రాష్ట్రవ్యాప్తం ఉద్యమం చేపడుతుందని వీర్రాజు హెచ్చరించారు.
Next Story