నష్టమంతా చంద్రబాబుకేనా..?
టీడీపీ విషయం చూస్తే సాలిడ్ గా మద్దతిచ్చే సామాజికవర్గం కమ్మ.. వీరు తప్ప ఇంకెవరూ కనబడటంలేదు. కాపుల ఓట్లు జనసేనకు పడతాయేమో కానీ, టీడీపీకి పడతాయని గ్యారంటీ లేదు.
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాస్ట్ పోలరైజేషన్ కూడా మొదలైపోయింది. జనసేన అంటే కాపుల పార్టీగా ముద్రపడింది. తెలుగుదేశంపార్టీ అంటే కమ్మపార్టీ అనే ముద్రలేకపోయినా ఆధిపత్యం కారణంగా, కొందరి ఓవర్ యాక్షన్ కారణంగా కమ్మ పార్టీ అనే నిందను భరించాల్సొస్తోంది. వైసీపీ అధినేత జగన్.. రెడ్డే అయినా ఇందులో బీసీలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి. ఎన్ని సామాజికవర్గాలున్నా ఆధిపత్యం మాత్రం రెడ్లదే అనటంలో అసలు సందేహమే లేదు.
ఇప్పుడు విషయం ఏమిటంటే.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారు. దాంతో గంగ చంద్రముఖిలా మారినట్లు జనసేన పూర్తిగా కాపుల పార్టీగా మారబోతోంది. దీంతో మెజారిటీ కాపులు జనసేనకు ఓట్లేసే అవకాశాలున్నాయి. వైసీపీ, టీడీపీలో అసంతృప్త కాపు నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఇక కాపులతో పడని బీసీలు, కాపుల్లో కొందరు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైసీపీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. జగన్ ఇస్తున్న ప్రయారిటీ కారణంగా బీసీల్లో మేజర్ సెక్షన్ మళ్ళీ వైసీపీకే అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు.
టీడీపీ విషయం చూస్తే సాలిడ్ గా మద్దతిచ్చే సామాజికవర్గం కమ్మ.. వీరు తప్ప ఇంకెవరూ కనబడటంలేదు. కాపుల ఓట్లు జనసేనకు పడతాయేమో కానీ, టీడీపీకి పడతాయని గ్యారంటీ లేదు. కాపుల పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న కారణంగా బీసీలు టీడీపీకి దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. బీసీలకు ప్రత్యామ్నాయంగా వైసీపీనే కనబడుతుంది. రెడ్లలో కొంత సెక్షన్ టీడీపీకి మద్దతుగా నిలిచే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీల మెజారిటీ మద్దతు వైసీపీకే దక్కే అవకాశాలు ఎక్కువ. 2019 ఎన్నికలో టీడీపీ తరపున గెలిచింది ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యే. ఎస్టీల్లో రెండు వరుస ఎన్నికల్లో టీడీపీతో తరఫున ఒక్కరు కూడా గెలవలేదు.
అలాగే ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వైసీపీకే మద్దతుగా నిలుస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే కూడా టీడీపీ తరఫున గెలవలేదు. అంటే ఏరకంగా చూసుకున్నా కమ్మ సామాజికవర్గం మాత్రమే సాలిడ్ గా టీడీపీకి మద్దతుగా నిలబడుతోంది. మిగిలిన సామాజికవర్గాల్లో అరకొర మద్దతు మాత్రమే దొరుకుతుంది. జనసేనకు మెజారిటీ కాపులు, వైసీపీకి మెజారిటీ బీసీలు మద్దతిస్తారు. రెండు మేజర్ సామాజికవర్గాల మద్దతు లేకపోతే నష్టపోయేది చంద్రబాబే అని అర్థమవుతోంది.