Telugu Global
Andhra Pradesh

'రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం AP ప్రత్యేక హోదాపైనే'

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు కర్నూలులో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతారని జైరాం రమేష్ చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం AP ప్రత్యేక హోదాపైనే
X

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయన మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఈ నెల 18న ఏపీలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో కలిసి జైరాం రమేష్ కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 18న కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని, 4 రోజుల పాటు 85 కి.మీ. సాగుతుందన్నారు.

భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, ఆ స్పందన చూసి, ఆరెస్సెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు జైరాం రమేష్. అందుకే యాత్రపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారాయన.

మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏపీ ప్రజలను గాయపరిచిందని తమకు తెలుసన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ దాన్నినాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుందనే ఆశాభావాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారు.

First Published:  4 Oct 2022 1:54 PM IST
Next Story