నేనే జగన్ ను కలిసి డిమాండ్ చేస్తా - కేఏ పాల్
కందుకూరు రోడ్ షోలో 8 మంది మృతి చెందిన ఘటనలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు .
కందుకూరు రోడ్ షోలో 8 మంది మృతి చెందిన ఘటనలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు . చంద్రబాబు నాయుడు కారణంగానే ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విరుచుకుపడ్డారు.
రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ఎక్కడ, ఎలాంటి మీటింగులు పెట్టాలో అర్థం కాదా అని ఆయన ప్రశ్నించారు
వెంటనే చంద్రబాబు నాయుడు పర్యటనలకు సంబంధించి అనుమతులు అన్ని రద్దు చేయాల్సిందిగా తానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి మరీ విజ్ఞప్తి చేస్తానని కేఏ పాల్ చెప్పారు. చంద్రబాబు నాయుడు సభలకు వెళ్తున్న జనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నారు.
500 రూపాయలు , బిర్యాని ప్యాకెట్ ఇస్తే సభలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఇరుకైన రోడ్ల మధ్యకు వేల మందిని ఎలా రప్పించారని కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఇలాంటి సమయంలో ఈ తరహా రోడ్ షోలు ఏమిటని నిలదీశారు.
500 రూపాయలు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మనుషుల్ని తీసుకొచ్చి , వారి ప్రాణాలు తీసి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా అని నిలదీశారు. పేదల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ఇదివరకే ఐదేళ్ల అవకాశమిస్తే ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు.