నీ సలహాలు వద్దు, నువ్వు వద్దు.. జోగయ్యపై పవన్ సెటైర్లు
యుద్ధం చేసే వాళ్లు తనకు కావాలని, కుతకుతలాడే రక్తంతో గుండెలు చీల్చుకునే వాళ్లు కావాలన్నారు. దాష్టీకంపై పోరాడే యువకులు కావాలన్నారు పవన్‌కల్యాణ్.

తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో మాట్లాడిన పవన్.. హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్యను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తను 24 సీట్లు తీసుకోవడంపై కొందరు తప్పు పడుతున్నారని.. తనకు, జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు అక్కర్లేదన్నారు పవన్‌కల్యాణ్.
యుద్ధం చేసే వాళ్లు తనకు కావాలని, కుతకుతలాడే రక్తంతో గుండెలు చీల్చుకునే వాళ్లు కావాలన్నారు. దాష్టీకంపై పోరాడే యువకులు కావాలన్నారు పవన్‌కల్యాణ్. కత్తులు పట్టుకునే వీరమహిళలు కావాలన్నారు. సలహాలిచ్చే వారికి జగన్ ఎలాంటి వాడో తెలుసా అంటూ ప్రశ్నించారు పవన్. తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు తెలుసన్నారు. మర్చిపోవద్దంటూ సలహాలిచ్చే వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ఇక తన స్థాయిని మరోసారి తగ్గించుకున్నారు పవన్. తనకు, తన పార్టీకి పోల్ మేనేజ్‌మెంట్ లేదని, క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన వైసీపీ, టీడీపీ లాంటి పార్టీలతో ఒంటరిగా పోటీ పడలేమన్నారు పవన్. బూత్ కార్యకర్తలు కూడా లేరన్నారు. 50 రోజుల పాటు కార్యకర్తలను పోషించే సత్తా జనసేనకు లేదని స్వయంగా చెప్పారు పవన్.