Telugu Global
Andhra Pradesh

ఫేస్‌బుక్‌లో విమర్శలు చేస్తే విద్వేషం రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుంది? ఏపీ హైకోర్టు ప్రశ్న... కేసు కొట్టివేత‌

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న, గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్ గోపీకృష్ణ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పసుపులేటి వీరాస్వామి గోపీకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు పాలకొల్లు పోలీసులు గోపీకృష్ణ పై కేసు నమోదు చేశారు.

ఫేస్‌బుక్‌లో విమర్శలు చేస్తే విద్వేషం రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుంది? ఏపీ హైకోర్టు ప్రశ్న... కేసు కొట్టివేత‌
X

సోషల్ మీడియాలో ప్రభుత్వాలను విమర్శిస్తూ పోస్టులు పెడితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు సహించడం లేదు. అలా పోస్టులు పెట్టినవాళ్ళపై కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ముందుకు వచ్చిన ఓ కేసు విషయంలో కోర్టు తీవ్రంగా స్పందించింది.

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న, గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్ గోపీకృష్ణ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పసుపులేటి వీరాస్వామి గోపీకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు పాలకొల్లు పోలీసులు గోపీకృష్ణ పై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ గోపీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుందని పోలీసులను ప్రశ్నింది.ఆయన ఫేస్‌బుక్ పోస్టులు సమూహాల మధ్య శత్రుత్వం పెంచేలా లేవని పేర్కొంటూ పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

గోపీకృష్ణపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేసిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ఆధారంగా పాలకొల్లు కోర్టులో జరుగుతున్న కేసును రద్దు చేసింది.

First Published:  18 Dec 2022 9:14 AM IST
Next Story