బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హోం మంత్రి
BY Raju Asari3 Nov 2024 3:29 PM IST

X
Raju Asari Updated On: 3 Nov 2024 3:29 PM IST
తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ కామాంధుడు మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
Next Story