డిప్యూటీ సీఎంగా పవన్.. లీక్ చేసిన అమిత్ షా, చిరంజీవి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖలు అప్పగించాలన్న విషయమై చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం నాయకులు చర్చలు జరుపుతున్నారు
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కూటమిలో మరో పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా? లేదా? అన్న చర్చలు సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి కన్ఫామ్ అని బీజేపీ అగ్రనేత అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి సమాచారాన్ని లీక్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం…
ఇవాళ ఉదయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖలు అప్పగించాలన్న విషయమై చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.అయితే కూటమి పెద్దలు ఈ విషయం గురించి చెప్పక ముందే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పొందనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి సమాచారాన్ని లీక్ చేశారు.
పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అమిత్ షా, చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంగా సంబోధించారు. దీంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి పక్కా అయిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పొందనున్నట్లు అమిత్ షా, చిరంజీవిలకు ముందే తెలియడంతోనే వారు ఆ విధంగా సంబోధించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.