''అబ్బనీ తీయని దెబ్బ'' - టెక్కలి ఎస్‌ఐపై వేటు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలో టెక్కలి ఎస్‌ఐ హరికృష్ణ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు.
BY Telugu Global6 Nov 2022 8:39 AM IST
X
Telugu Global Updated On: 6 Nov 2022 8:39 AM IST
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్‌ఐ హరికృష్ణపై వేటు పడింది. ఎస్‌ఐ అయిఉండి అధికార పార్టీ ఎమ్మెల్సీ పుట్టిన రోజు వేడుకల్లో డ్యాన్సులు చేశాడు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలను టెక్కలిలో ఏర్పాటు చేశారు. ముంబాయి నుంచి యువతులను రప్పించి డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు.
పుట్టిన రోజు వేడకకు వచ్చిన ఎస్‌ఐ హరికృష్ణ వేదిక మీదకు వెళ్లి అమ్మాయిలతో కలిసి ''అబ్బనీ తీయని దెబ్బ'' పాటకు డ్యాన్స్ వేశారు. తనతో పాటు డ్యాన్స్ వేసేందుకు రావాల్సిందిగా వైసీపీ శ్రేణులను పిలిచి ప్రోత్సహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఎస్‌ఐ హరికృష్ణపై వేటు వేశారు. అతడిని వీఆర్‌కు పంపారు. ఈ మేరకు ఎస్పీ జి.ఆర్. రాధిక ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story