Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రోగ్రాంను స‌మ‌ర్థించిన‌ హైకోర్టు

ప్రభుత్వం ఘనతను ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేయటం తప్పెలాగ అవుతుందని సూటిగా ప్రశ్నించింది. అయితే కేసును విచారణకు స్వీకరించింది కాబట్టి చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయితీ రాజ్, మున్సిపాలిటీ శాఖల అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది.

జగన్ ప్రోగ్రాంను స‌మ‌ర్థించిన‌ హైకోర్టు
X

వై ఏపీ నీడ్స్ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయాలని అనుకున్న ప్రతిపక్షాలకు షాక్ కొట్టింది. ప్రోగ్రాంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనటంలో తప్పేముందని నిలదీసింది. కేంద్రంతో పాటు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్లే ఏపీ ప్రభుత్వం కూడా చేస్తోంది కదా అని పిటీషనర్‌ను అడిగింది. ప్రభుత్వం ఘనతను ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేయటం తప్పెలాగ అవుతుందని సూటిగా ప్రశ్నించింది. అయితే కేసును విచారణకు స్వీకరించింది కాబట్టి చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయితీ రాజ్, మున్సిపాలిటీ శాఖల అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అన్నది నూరు శాతం పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమంలో పార్టీ నేతలు మాత్రమే ఉండాలి. అలాంటిది పార్టీ నేతలతో జతగా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటున్నట్లు పిటీషనర్ ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనటం ఏమిటని ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే గతంలో చంద్రబాబు హయాంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఇలాగే జరిగాయి. అయితే అప్పట్లో ఎవరు అభ్యంతరం చెప్పి కోర్టుల్లో కేసులు వేయలేదు.

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిపక్షాలు ఏదో రూపంలో వందల పిటీషన్లు వేసిన విషయం తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అమలును కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో టీడీపీయే ఒక జర్నలిస్టుతో కేసు వేయించినట్లు ఆరోపణలున్నాయి.

అయితే కేసు విచారణ సందర్భంగా కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం విషయంలో ఇలాగే చేస్తున్న విషయాన్ని హైకోర్టు చెప్పింది. జమ్మూ-కశ్మీర్లో కూడా ప్రభుత్వం ఇలాగే చేస్తుందని జడ్జి తెలిపారు. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో అధికారులు పాల్గొనటంలో తప్పేమీలేదని జడ్జి తేల్చేశారు. న్యాయ సేవలను జనాలకు వివరించటంలో కోర్టులు కూడా ప్రభుత్వ సాయాన్ని తీసుకోవటాన్ని జడ్జి గుర్తుచేశారు. ప్రభుత్వాలు ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇందులో భాగమే అని చెప్పారు. కాబట్టి ప్రోగ్రాంను ఆపాలన్న పిటీషనర్ వాదనను హైకోర్టు కొట్టేసింది.

First Published:  30 Nov 2023 11:10 AM IST
Next Story