Telugu Global
Andhra Pradesh

బాలయ్య మంచోడే..! హీరోయిన్ సర్టిఫికెట్

ఆ వివాదం జోలికి పోకుండా ఆయన మంచివారంటూ సర్టిఫికెట్ ఇచ్చారు అంజలి. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

బాలయ్య మంచోడే..! హీరోయిన్ సర్టిఫికెట్
X

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన అతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ అంజలితో ఆయన దురుసుగా ప్రవర్తించారనే విషయం ఆ వీడియోలు చూసిన అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం బాలయ్యను కవర్ చేయడానికి తంటాలు పడుతోంది. ఈ విషయంలో నటి అంజలి కూడా బాలయ్యకు హెల్ప్ చేయాలనుకోవడం విశేషం.


ఆయనంటే నాకెంతో గౌరవం..

బాలకృష్ణ అంటే తనకెంతో గౌరవం అని, ఆయన కూడా తనతో అంతే అభిమానంతో ఉంటారని చెప్పుకొచ్చారు హీరోయిన్ అంజలి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన హాజరు కావడం, ఆయనతో తాను వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ ఈవెంట్ లో బాలయ్యతో తాను కలసి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అంజలి.

వివాదం జోలికి పోకుండా..

స్టేజ్ పై హీరోయిన్ అంజలిని పక్కకు తోసేసిన వీడియో వైరల్ కాగా.. ఆ వీడియోని కూడా తన పోస్ట్ లో పొందుపరిచారు అంజలి. ఆ వివాదం జోలికి పోకుండా ఆయన మంచివారంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. అంజలి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మందు బాటిల్ వివాదం..

ఇక ఇదే కార్యక్రమంలో బాలకృష్ణ పక్కన వాటర్ బాటిల్ లో మద్యం ఉండటం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై సినీ నిర్మాత నాగవంశీ స్పందించారు. అదంతా గ్రాఫిక్స్ అని కొట్టిపారేశారు. ఫంక్షన్లో మద్యం బాటిల్ ఉందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.

First Published:  31 May 2024 3:29 AM GMT
Next Story