షర్మిల ఓవర్ యాక్షన్ రివర్సు కొట్టిందా..?
జగన్ ప్రభుత్వంపైన షర్మిల ఎన్నిఆరోపణలు చేసినా విజయమ్మ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇంటి విషయాలను షర్మిలను రచ్చకీడ్చిందో అప్పుడే విజయమ్మలో ఆలోచన మొదలైనట్లుంది.
సోదరుడు జగన్మోహన్ రెడ్డిపైన చెల్లెలు షర్మిల గడచిన వారంరోజులుగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఆ ఓవర్ యాక్షనే ఇప్పుడు షర్మిలకు తల్లి విజయమ్మ రూపంలో రివర్సు కొట్టిందట. విషయం ఏమిటంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫ/న విజయమ్మ ప్రచారం చేయబోతున్నట్లు ఎల్లోమీడియా గోల మొదలు పెట్టేసింది. జగన్ కు మద్దతుగా విజయమ్మ ప్రచారం చేయటాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారట. వైసీపీకి ప్రచారం చేయటం తనకు ఇష్టంలేదు కాబట్టి జగన్ దగ్గరకు వెళ్ళొద్దని షర్మిల చెప్పినా విజయమ్మ వినలేదట.
మొత్తంమీద ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే.. జగన్ ప్రభుత్వంపైన షర్మిల ఎన్నిఆరోపణలు చేసినా విజయమ్మ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇంటి విషయాలను షర్మిలను రచ్చకీడ్చిందో అప్పుడే విజయమ్మలో ఆలోచన మొదలైనట్లుంది. చంద్రబాబు, ఎల్లోమీడియా ట్రాపులో షర్మిల చిక్కుకున్నారనే ఆరోపణలు, ప్రచారం బాగా పెరిగిపోతోంది. పైగా అన్నతో గొడవల్లో తనను రోడ్డుమీదకు ఈడ్చినట్లు విజయమ్మ ఫీలైనట్లున్నారు. తమిద్దరి మధ్య గొడవలకు తల్లే సాక్ష్యమన్నారు. తాను చెప్పింది తప్పా, ఒప్పా అన్న విషయమై తల్లినే అడగమని కూడా చాలెంజ్ చేశారు.
సరిగ్గా ఇక్కడే విజయమ్మ ఆలోచించుంటారు. జగన్ ప్రత్యర్థుల ట్రాపులో షర్మిల ఇరుక్కుని తనను కూడా బజారుకు లాగటాన్ని విజయమ్మ జీర్ణించుకోలేకపోయుంటారు. అందుకనే షర్మిలను వదిలేసి జగన్ కు మద్దతుగా నిలబడాలని విజయమ్మ నిర్ణయించుకుంటే అందులో ఆమె తప్పేముంది..? తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు అండగా ఉండటం కోసమే విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి అండగా నిలబడ్డారు. అదే షర్మిల తెలంగాణలో చాపచుట్టేసి ఏపీకి వచ్చి డైరెక్టుగా జగన్నే చాలెంజ్ చేస్తానంటే విజయమ్మ ఎలా ఒప్పుకుంటారు..?
వైసీపీకి ప్రచారం చేయటంతోనే విజయమ్మ సరిపెట్టుకుంటారా..? లేకపోతే ఏదైనా నియోజకవర్గం నుండి పోటీకూడా చేస్తారా అన్నది తెలీదు. ఏదేమైనా షర్మిల ఓవర్ యాక్షన్ కారణంగానే జగన్ కు మద్దతుగా నిలబడాలని విజయమ్మ డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది. వన్ టు వన్ అయితే జగన్-షర్మిల గొడవలకు విజయమ్మ దూరంగా ఉండేవారేనేమో. అదే చంద్రబాబు, ఎల్లోమీడియా అండతో షర్మిల అన్నపైన రెచ్చిపోతున్నారన్న విషయం విజయమ్మకు అర్థమైపోయింది. అందుకనే తాను జగన్ కు అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. దాన్నే షర్మిల, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది.