గుంటూరు: చంద్రబాబు సభలో మళ్ళీ తొక్కిసలాట.. ఒకరి మృతి ,పలువురికి గాయాలు
గుంటూరు పట్టణంలో ఈ సాయంత్రం ప్రవాసాంధ్రుల అద్వర్యంలో మహిళలకు జనతా వస్త్రాల పంపిణీ, పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, సభ జరిగింది. ఈ సభకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు.
కందుకూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన ఘటన మర్చిపోకముందే కొద్ది సేపటిక్రితమే మళ్ళీ బాబు సభలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
గుంటూరు పట్టణంలో ఈ సాయంత్రం ప్రవాసాంధ్రుల అద్వర్యంలో మహిళలకు జనతా వస్త్రాల పంపిణీ, పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, సభ జరిగింది. ఈ సభకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం వారం రోజులుగా టీడీపీ వర్గాలు తీవ్ర కృషి చేశారు. చంద్ర బాబు ప్రసంగం తర్వాత నిర్వాహకులు జనతా వస్త్రాలు రేపిస్తామని ప్రకటించడంతో ఒక్క సారి తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట కారణంగా స్త్రీలు, వృద్దులు కొంద పడిపోగా వారిని తొక్కుకుంటూ ప్రజలు పరిగెత్తడంతో ఓ మహిళ చనిపోయింది. అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సభా ప్రాంగణంలో 10 వేల మంది మాత్రమే పడతారని అయితే టీడీపీ వర్గాలు 30 వేల మందిని తరలించారని సభకు వచ్చిన వారు చెప్తున్నారు. నిర్వాహకుల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.