ఏపీలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు పదేళ్లపాటు వయో పరిమితి నుంచి సడలింపు ఉంటుంది. కోవిడ్ సమయంలో సేవలందించినవారు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసినవారికి ఈ పోస్టుల భర్తీలో వెయిటేజీ ఉంటుంది.
ఏపీలో 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి డిసెంబర్ 5 వరకు http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థుల దరఖాస్తులను డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జీ ఎన్ ఎం/ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారు అర్హులు. వయస్సు అర్హత 42 ఏళ్లలోపు ఉండాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు పదేళ్లపాటు వయో పరిమితి నుంచి సడలింపు ఉంటుంది. కోవిడ్ సమయంలో సేవలందించినవారు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసినవారికి ఈ పోస్టుల భర్తీలో వెయిటేజీ ఉంటుందని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్టును వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. భవిష్యత్తులో వచ్చే ఖాళీల భర్తీకి వాటిని వినియోగించుకుంటుంది.
ప్రభుత్వాస్పత్రుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకు 46 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ మాత్రం బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు శుభవార్తే.